Rajendra Prasad : స్టేజిపై మరోసారి బూతుపదం మాట్లాడి వైరల్ అవుతున్న రాజేంద్రప్రసాద్.. అలీని తిట్టడంతో..
ఈ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అనుకోకుండా అలీని ఓ బూతుపదంతో ప్రస్తావించి..

Rajendra prasad Inappropriate Speech in Event and Degrade Comedian Ali
Rajendra Prasad : సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇప్పటికి కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన వివాదాలతో వార్తల్లో కూడా నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్లో డేవిడ్ వార్నర్ ని అనుకోకుండా ఓ మాట అనడంతో బాగా ట్రోల్ అయ్యారు. దాంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి స్టేజిపై బూతుపదం వాడి విమర్శల పాలవుతున్నారు.
తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించగా ఈ ఈవెంట్ కి ఆయనతో పనిచేసిన నటీనటులంతా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అనుకోకుండా అలీని ఓ బూతుపదంతో ప్రస్తావించి మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా అన్నారు. సాధారణంగా వాళ్లు ఎంత క్లోజ్ అయినా బయట బూతు పదాలతో మాట్లాడుకున్నా ఎవరు పట్టించుకోరు.
Also Read : Prasad Behara : అన్ని వదిలేసి.. ప్రపంచమంతా నడుచుకుంటూ వెళ్ళాలి.. అంతా ప్రిపేర్ చేసుకున్నా.. కానీ..
కానీ స్టేజిపై అంతమంది నటీనటుల ముందు అలీని అలా అనడంతో పలువురు రాజేంద్ర ప్రసాద్ ని విమర్శిస్తున్నారు. అలాగే అదే స్టేజిపై ఎన్టీఆర్ అవార్డు గురించి మాట్లాడుతూ చప్పట్లు కొట్టారా అని అడిగి కొట్టించుకున్నారు. దానికి మురళీమోహన్ స్పందించగా కొట్టకపోతే సిగ్గు లేనట్లే అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయి మరోసారి రాజేంద్రప్రసాద్ వివాదంలో నిలిచారు. మరి దీనిపై కూడా రాజేంద్రప్రసాద్ క్షమాపణ చెప్తారా లేక అలీ మనవాడే అని అలీతో మాట్లాడతారా చూడాలి.
కమెడియన్ ఆలీ మీద నోరు పారేసుకున్న నటుడు రాజేంద్రప్రసాద్#ComedianAli #RajendraPrasad #Tollywood pic.twitter.com/zaushavexv
— TeluguDesk (@telugudesk) June 1, 2025