Manchu Vishnu : రిషబ్ పంత్ నాకు ఇన్‌స్పిరేషన్.. అతనికి కాలు తీసేయాలి అనే స్టేజి నుంచి ఇవాళ.. మంచు విష్ణు వ్యాఖ్యలు వైరల్..
మంచు విష్ణు రిషబ్ ని గుర్తుచేస్తూ ఓ విషయం చెప్పారు ఇంటర్వ్యూలో.

Manchu Vishnu Interesting Comments on Rishabh Pant
Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. జూన్ 27న కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
2022 డిసెంబర్‌లో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ నుదురు, కుడి మోకాలు, కాలి లిగ్మెంట్ వద్ద భారీ గాయాలయ్యాయి. దాన్నుంచి కోలుకోడానికి పంత్ కి ఆల్మోస్ట్ రెండేళ్లు పట్టింది. ఇటీవలే ఐపీఎల్ తో కంబ్యాక్ ఇచ్చాడు. మంచు విష్ణు రిషబ్ ని గుర్తుచేస్తూ ఓ విషయం చెప్పారు ఇంటర్వ్యూలో.
Also Read : Pawan Kalyan : OG షూటింగ్ షెడ్యూల్ పూర్తి.. ముంబై నుంచి పవన్ రిటర్న్..? OG కి మళ్ళీ బ్రేక్..
మంచు విష్ణు మాట్లాడుతూ.. దేనికైనా టైం పడుతుంది. ఒక పెయిన్ పోవాలంటే టైం తీసుకోవాలి, వెయిట్ చేయాలి. ఒక సర్జరీ జరగ్గానే మళ్ళీ అంతకుముందులా ఉండము. కొంత సమయం, మెడిసిన్ తీసుకున్నాకే కోలుకుంటాము. రిషబ్ పంత్ ఒక గ్రేట్ ఉదాహరణ. అతనికి యాక్సిడెంట్ అయి కాలు తీసేయాలి అన్నారట. అతను నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు. కానీ అతని గురించి చదివాను, అతని మ్యాచ్ లు చూస్తాను. కాలు తీసేయాలి అనే స్టేజి నుంచి ఇవాళ క్రికెట్ మళ్ళీ బాగా ఆడి అందరూ పొగిడేలా చేస్తున్నాడు. ఆ రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. నాకు అతను ఇన్‌స్పిరేషన్. అతను సర్జరీ తర్వాత టైం తీసుకొని, ఫోకస్ గా ఉండి కృషి చేసి మళ్ళీ వచ్చాడు అని అన్నారు. దీంతో విష్ణు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Re Release Movies : కొత్త సినిమాలను తొక్కేస్తున్న రీ రిలీజ్ సినిమాలు.. డైరెక్ట్ గానే చెప్తున్న నిర్మాతలు..