Site icon 10TV Telugu

Laggam : ‘లగ్గం’ సినిమా రివ్యూ.. తెలంగాణ పెళ్లి ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్..

Rajendra Prasad Laggam Movie Review and Rating

Rajendra Prasad Laggam Movie Review and Rating

Laggam Movie Review : సాయి రోనక్, ప్రగ్య నగ్ర మెయిన్ లీడ్స్ లో రాజేంద్ర ప్రసాద్, రోహిణి, రఘుబాబు, సప్తగిరి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా లగ్గం. వేణుగోపాల్ రెడ్డి నిర్మాణంలో రమేష్ చెప్పాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. లగ్గం సినిమా నేడు అక్టోబర్ 25న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. సదానందం(రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస(ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలి అని తన చెల్లెలు సుగుణ(రోహిణి) కొడుకు (సాయి రోనక్)ని చూడడానికి సిటీకి వస్తాడు. తన అల్లుడి లగ్జరీ జీవితం, సాఫ్ట్ వేర్ లైఫ్ చూసి తన కూతుర్ని అతనికే ఇచ్చి చేయాలని తన చెల్లెలితో మాట్లాడి లగ్గం ఫిక్స్ చేసుకుంటారు. మరి ఆ పెళ్లి జరిగిందా? పెళ్లి జరగడానికి ఏం కావాలి? ఇరు కుటుంబాలు ఎలా ఉండాలి? పెళ్లిని ఎంత గొప్పగా సాంప్రదాయంగా చేయొచ్చు అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Pottel : ‘పొట్టేల్’ మూవీ రివ్యూ.. కథ మంచిదే.. కానీ కథనమే..

సినిమా విశ్లేషణ.. ఈ సినిమా ముఖ్యంగా తెలంగాణ నేపథ్యంలో పెళ్లిని ఎలా చేస్తారు అనే విధంగా చూపించారు. తెలంగాణలో పెళ్లిని కొన్ని చోట్ల లగ్గం అని పిలుస్తారని తెలిసిందే. ఆ లగ్గం చుట్టూ ఉండే కథేంటి? ఆచారాలు, పద్ధతులు, సంబరాలు ఏంటి అని చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్స్ క్యారెక్టర్స్, హీరోయిన్ తండ్రి సిటీకి వచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకోవడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొల్పుతారు. ఇక సెకండ్ హాఫ్ అంతా పెళ్లి, దాని చుట్టూ ఉన్న ఎమోషన్, పెళ్ళిలో జరిగే మంచి, చెడుతో సాగుతుంది.

అలాగే పెళ్లి అంటే ఉండే సరదా సన్నివేశాలతో పాటు బంధువులు అంతా ఒకదగ్గరికి చేరడం చూపిస్తారు. లగ్గం సినిమా క్లైమాక్స్ మాత్రం మంచి ఎమోషనల్ గా మెప్పిస్తుంది. పెళ్లి అయ్యాక అప్పగింతలు చేసి కూతురిని మెట్టినింటికి పంపించే ఘట్టంతో పెళ్లి ముగిసినట్టు సినిమాని కూడా అదేవిధంగా ముగించారు. సినిమా అక్కడక్కడా కొంత సాగదీసినట్టు ఉంటుంది. అలాగే తెలంగాణ యాసలో తీయడం, చాలా మంది ఆర్టిస్టులకు ఆ తెలంగాణ యాస సెట్ కాకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. సాయి రోనక్, ప్రగ్య నగ్ర పెళ్లి జంటగా మెప్పించారు. రాజేంద్రప్రసాద్ కూతురి తండ్రి పాత్రలో జీవించేసారు. ఇక రోహిణి అమ్మ పాత్రలకు పెట్టింది పేరు. రఘుబాబు, LB శ్రీరామ్, సప్తగిరి, రచ్చ రవి, చమ్మక్ చంద్ర, వడ్లమాని శ్రీనివాస్, కిరీటి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పెళ్లి సెటప్, పెళ్లి మండపం.. అన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేసింది. మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. దర్శకుడు రమేష్ తెలంగాణలో జరిగే ఒక పెళ్లి చుట్టూ కథ రాసుకొని ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ తో చూపించారు. నిర్మాణ పరంగా కుడా సినిమాకు కావాల్సినంత ఖర్చు బాగానే పెట్టారు.

మొత్తంగా ‘లగ్గం’ సినిమా ఆతెలంగాణలో జరిగే ఓ పెళ్లి, దాని చుట్టూ ఉండే ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ తో రాసుకున్న కథ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Exit mobile version