వావ్.. సూపర్ హీరో.. రజనీ ఫిట్‌నెస్ చూసి ఫిదా అయిన బేర్ గ్రిల్స్ 

  • Published By: sreehari ,Published On : March 20, 2020 / 03:46 PM IST
వావ్.. సూపర్ హీరో.. రజనీ ఫిట్‌నెస్ చూసి ఫిదా అయిన బేర్ గ్రిల్స్ 

Updated On : March 20, 2020 / 3:46 PM IST

సాహసవీరుడు, బేర్ గ్రిల్స్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ వైల్డ్ ఎపిసోడ్ కిరాకు పుట్టిస్తోంది. మార్చి 23న ప్రసారం కానున్న ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్‌లో రజనీకాంత్ కనిపించనున్నాడు. డిస్కవరీ ఛానెల్‌లో ఈ వైల్డ్ షో ప్రసారం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీతో వైల్డ్ షో చేసిన తర్వాత మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో బేర్ గ్రిల్స్ తో రజనీ తనదైన స్టయిల్‌తో ఆకట్టుకుంటున్నాడు.

రజనీకాంత్‌ తొలిసారి బుల్లితెరపై కనిపించనున్నడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. డిస్కవరీ ఛానల్‌లో శుక్రవారం రిలీజ్ అయిన స్నీక్ పీక్ ఎపిసోడ్ హైలెట్‌గా నిలిచింది. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో బేర్ గ్రిల్స్, రజనీ ఇద్దరూ కలిసి కొన్ని అడ్వంచర్లతో ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో రజనీ భారతదేశం నీటి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటోంది వంటి అంశాలను ప్రస్తావించారు.

అంతేకాదు.. రజనీ తన జీవితంలో సూపర్ స్టార్ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది కూడా వివరించారు. తన బస్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కె.బాలచందర్ తనకు సినిమాల్లో అవకాశం ఇచ్చారని రజనీ గుర్తు చేసుకున్నారు. తాడుతో సాయంతో ఎత్తైన ప్రదేశానికి ఇద్దరూ చేరుకున్నారు. నిజమైన అడ్వెంచర్ అంటే ఇదేనంటూ రజనీ అంటుండగా… బేర్ గ్రిల్స్.. రజనీ కాలికి షూ లేస్ ఊడిపోవడం గమనించి సరిచేశాడు. దాంతోరజనీ సంతోషించి థ్యాంక్స్ చెప్పాడు.

అందుకు గ్రిల్స్.. మీరు చాలా ఫిట్ గా ఉన్నారని, మీరు ఏమనుకోనంటే మీ వయస్సు ఎంతో చెబుతారా? అని రజనీని అడిగాడు. దానికి రజనీ నవ్వుతూ.. తనకు 70 ఏళ్లు అని అనడంతో గ్రిల్ షాక్ అయ్యాడు.. వావ్.. మీరే మా అందరికి స్ఫూర్తి అంటూ గ్రిల్ ఎమోషనల్ అయ్యాడు.

బేర్ గ్రిల్స్ ఇటీవలే రజనీతో కలిసి వైల్డ్ జర్నీకి సంబంధించి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మార్చి 23న డిస్కవరీ ఛానల్లో రాత్రి 8 గంటలకు వైల్డ్ ప్రిమియర్స్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.