Rajinikanth Comments On Balakrishna And His Movie
Rajinikanth: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను విజయవాడలో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబులతో పాటు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకాగా, ఈ వేడుకలో రజినీకాంత్ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకున్నారు. అచ్చ తెలుగులో మాట్లాడిన రజినీ, అందరినీ ఆకట్టుకున్నాడు.
Rajinikanth: ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం చాలా ప్రత్యేకం – రజినీకాంత్
ఇక ఇదే వేడుకలో నందమూరి బాలకృష్ణపై రజినీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. బాలకృష్ణ చేసే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందని.. ఆయన కంటిచూపుతోనే చంపేస్తాడని సరదాగా కామెంట్ చేశారు. బాలయ్య ఒక జీపును తంతే అది 20-30 అడుగులు వెనక్కి వెళ్తుందని.. ఇలాంటి పవర్‌ఫుల్ సీన్స్ కేవలం బాలయ్య ఒక్కడివల్లే వీలవుతాయని రజినీ తెలిపాడు. ఇంతటి పవర్‌ఫుల్ సీన్స్ తాను కానీ, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ చేయలేమని.. కేవలం బాలయ్యకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని రజినీ పేర్కొన్నాడు.
Rajinikanth : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం విజయవాడలో సూపర్ స్టార్.. బాలయ్యతో కలిసి రజినీ సందడి..
ఎన్టీఆర్ లాంటి మహనీయుడి శతజయంతి ఉత్సవాలకు తనను గెస్టుగా పిలవడం చాలా సంతోషాన్ని కలిగించిందని రజినీకాంత్ ఈ సందర్భంగా తెలిపాడు. నందమూరి అభిమానులు కూడా తన సినిమాలను ఆదరించారని.. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా రజినీకాంత్ కామెంట్ చేశారు.