తారల హడావిడి : గ్రాండ్‌గా రజినీ కుమార్తె పెళ్లి

సౌందర్య, విషాగన్‌ల వివాహం ఈరోజు ఉదయం చెన్నైలో జరుగుతుంది.

  • Published By: sekhar ,Published On : February 11, 2019 / 06:20 AM IST
తారల హడావిడి : గ్రాండ్‌గా రజినీ కుమార్తె పెళ్లి

సౌందర్య, విషాగన్‌ల వివాహం ఈరోజు ఉదయం చెన్నైలో జరుగుతుంది.

సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ రెండవ కూతురు సౌందర్య, విషాగన్‌ల ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ మొన్ననే గ్రాండ్‌గా జరిగింది. ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌కి వచ్చిన వారందరికీ రిటర్న్ గిఫ్ట్‌గా మొక్కలు పంచారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సౌందర్య, విషాగన్‌ల వివాహం ఈరోజు ఉదయం(ఫిబ్రవరి 11) చెన్నైలో జరుగుతుంది. సినీ, రాజకీయ ప్రముఖులు, రజినీ రిలేటివ్స్ అందరూ ఈ వివాహానికి అటెండ్ అయ్యారు. కమల్ హాసన్, పళనీ స్వామి తదితరులు హాజరై, నూతన వధువరులను ఆశ్వీర్వదించారు. 

 రజినీ దంపతులు సాంప్రదాయ ఆచారాలన్నీ నిర్వహించారు. తమ పద్దతుల్లో పలు పూజా కార్యక్రమాలు జరిపారు. రజినీ పెద్ద కూతురు ఇశ్వర్య, పెద్దల్లుడు ధనుష్ అతిథులకు ఆహ్వానం పలికారు.

వాచ్ వీడియో…