Rajinikanth : ఒకప్పుడు రజినీకాంత్ బస్ కండక్టర్.. ఇప్పుడు బస్ కండక్టర్ కొడుకు ఆయనతో సినిమా చేసి.. ఆ నెంబర్ పెట్టి..

రజినీకాంత్ ఇప్పుడు కూలీ సినిమాతో ఆగస్టు 14న రాబోతున్నారు.

Rajinikanth

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకప్పుడు బస్ కండక్టర్ అని అందరికి తెలిసిందే. బస్ కండక్టర్ నుంచి నటుడిగా మారి చిన్న చిన్న పాత్రలు, విలన్ వేషాలు వేస్తూ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇప్పటికి 74 ఏళ్ళు వచ్చినా ఇంకా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రజినీకాంత్. రజినీకాంత్ ఇప్పుడు కూలీ సినిమాతో ఆగస్టు 14న రాబోతున్నారు.

తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, ట్రైలర్ తో సినిమా అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌభిన్ షాహిర్.. లాంటి స్టార్స్ ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Kingdom : కేరళలో విజయ్ దేవరకొండ హవా.. ఏ హీరో సాధించలేని రికార్డ్ కింగ్డమ్ తో..

కూలీ సినిమాలో రజినీకాంత్ కి 1421 అనే బ్యాడ్జ్ నెంబర్ ఇచ్చారు. దాని గురించి లోకేష్ మాట్లాడుతూ.. మా నాన్న బస్ కండక్టర్. నేను రజిని సర్ కి ఈ సినిమా చెప్పినప్పుడు, ఇందులో బ్యాడ్జ్ నెంబర్ చెప్పినప్పుడు ఆయన ఆ నెంబర్ ఎందుకు అని అడిగారు. మా నాన్న బస్ కండక్టర్ సర్, ఆయన బ్యాడ్జ్ నెంబర్ అది. ఆయనకు గౌరవంగా ఆ నెంబర్ పెట్టాను అని చెప్పను. దాంతో రజిని సర్ ఆశ్చర్యపోయి మీ నాన్న బస్ కండక్టర్ అని నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించినట్టు తెలిపాడు.

అలా ఒక బస్ కండక్టర్ కొడుకు ఒకప్పటి బస్ కండక్టర్ ని డైరెక్ట్ చేసి భారీ బడ్జెట్ సినిమా తీసాడు. దీంతో లోకేష్ కనగరాజ్ ని మరోసారి అందరూ అభినందిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ వాళ్లకు మొదటి 1000 కోట్ల సినిమా అవుతుందని అంతా ఆశిస్తున్నారు.

Also Read : Sukumar : కూతురు నేషనల్ అవార్డు గెలవడంపై సుకుమార్ ఎమోషనల్ పోస్ట్.. ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను అంటూ..