Sukumar : కూతురు నేషనల్ అవార్డు గెలవడంపై సుకుమార్ ఎమోషనల్ పోస్ట్.. ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను అంటూ..
సుకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూతురు సుకృతి వేణిని అభినందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

Sukumar
Sukumar : ఇటీవల 71వ నేషనల్ ఫిలిం అవార్డులు ప్రకటించగా అందులో జాతీయ ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు సినిమాకు గాను సుకుమార్ కూతురు సుకృతి వేణి గెలుచుకుంది. మరో ఇద్దరికీ కూడా ఈ అవార్డుని షేర్ చేసారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటి సినిమాతోనే అందర్నీ మెప్పించడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా గెలవడంతో ఆమెపై అభినందనలు కురిపిస్తున్నారు అంతా.
అయితే సుకుమార్ అమెరికాలో ఉండటంతో కాస్త ఆలస్యంగా కూతురు నేషనల్ అవార్డుపై స్పందించారు. సుకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూతురు సుకృతి వేణిని అభినందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
Also Read : Athadu : రీ రిలీజ్ లో మహేష్ మరోసారి రికార్డ్.. రిలీజ్ కి ముందే ‘అతడు’ కలెక్షన్స్ సునామీ..
ఈ పోస్ట్ లో సుకుమార్.. నా ప్రియమైన కూతురు.. నువ్వు ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకున్నావని విన్నప్పుడు నాకు నోట మాట రాలేదు. నా ప్రయాణంలో కొన్ని అవార్డులు దక్కడం నా అదృష్టం కానీ ఇది నా హృదయాన్ని తాకింది. గాంధీ తాత చెట్టు సినిమాలో నిన్ను చూస్తుంటే నిజాయితీగా చెప్పాలంటే నేను నా సొంత కూతురిని చూస్తున్నానని మర్చిపోయాను. నువ్వు ఆ పాత్రలోని అమ్మాయివి అయ్యావు. నీ కళ్ళలో అంత నిజాయితీ, అంత భావోద్వేగం ఉంది. నువ్వు నటించడమే కాదు ఆ కథని చెప్పావు. నీకు సెట్‌లో సరదాగా మొదలైన పని ఇప్పుడు చాలా మంది నిన్ను అభినందిస్తుంటే నాకు అది ఏ అవార్డు కన్నా గొప్పగా అనిపిస్తుంది. నువ్వు ఇప్పటికీ చిన్నపిల్లవి కావచ్చు కానీ ఈరోజు నువ్వు మా అందరికి అంకితభావం, కృషి ఉంటే నిజంగా ఏం చేయగలవో చూపించావు. నీ తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. దానికి మించి నీకున్న దయ, నిజాయితీకి నేను నిన్ను అభినందిస్తున్నాను. ఈ సినిమా వెనుక ఉన్న అందరికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ అవార్డు మీ అందరికీ కూడా చెందుతుంది. ఈ అవార్డు ఇచ్చిన జ్యూరీకి ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే. నీ కోసం ఇంకా చాలా కలలు వేచి ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాను, నువ్వు చూస్తూ, నిన్ను ఉత్సాహపరుస్తూ ఉంటాను. ఇవాళ నీ చిరునవ్వు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అవార్డు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Also Read : Thaman : మాట నిలబెట్టుకున్న తమన్.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ కి OG లో ఛాన్స్..