Athadu : రీ రిలీజ్ లో మహేష్ మరోసారి రికార్డ్.. రిలీజ్ కి ముందే ‘అతడు’ కలెక్షన్స్ సునామీ..

ఇప్పటికే మహేష్ బాబు ఖలేజా, మురారి, బిజినెస్ మ్యాన్, ఒక్కడు, పోకిరి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.

Athadu : రీ రిలీజ్ లో మహేష్ మరోసారి రికార్డ్.. రిలీజ్ కి ముందే ‘అతడు’ కలెక్షన్స్ సునామీ..

Athadu

Updated On : August 3, 2025 / 5:33 PM IST

Athadu : ఇటీవల రీ రిలీజ్ ల సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తూ భారీ కలెక్షన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేకమంది స్టార్ హీరోల పాత సినిమాలు, క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. మహేష్ బాబు అతడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే మహేష్ బాబు ఖలేజా, మురారి, బిజినెస్ మ్యాన్, ఒక్కడు, పోకిరి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అతడు సినిమా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజున రీ రిలీజ్ కానుంది. ఇటీవల దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అతడు 4K రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కూడా అవ్వకుండానే అడ్వాన్స్ బుకింగ్స్ లో కలెక్షన్స్ అదరగొడుతుంది.

Also Read : Thaman : మాట నిలబెట్టుకున్న తమన్.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ కి OG లో ఛాన్స్..

అతడు సినిమా రిలీజ్ కి ఇంకా ఆరు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ తో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ లెక్కన రిలీజ్ వరకు, రిలీజ్ తర్వాత ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి. గతంలో మహేష్ ఖలేజా సినిమా 10 కోట్లు, మురారి సినిమా 8 కోట్లు, బిజినెస్ మ్యాన్ సినిమా 5 కోట్లు రీ రిలీజ్ లో కలెక్ట్ చేసాయి. మరి ఇప్పుడు అతడు సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో.

 

Also Read : Tamil Directors : తమిళ్ స్టార్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. ఫొటో వైరల్.. ఎవరెవరు ఉన్నారో తెలుసా?