Thaman : మాట నిలబెట్టుకున్న తమన్.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ కి OG లో ఛాన్స్..
గతంలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో తమన్ జడ్జిగా చేసిన సంగతి తెలిసిందే.

Thaman
Thaman : ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ షోతో తెలుగులో ఉన్న సింగర్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి కాగా ప్రస్తుతం నాలుగో సీజన్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. త్వరలో తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ మొదలు కానుంది.
గతంలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో తమన్ జడ్జిగా చేసిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లో సింగర్స్ నజీర్, భరత్ రాజ్ పర్ఫార్మెన్స్ లు తమన్ కు నచ్చి పవన్ కళ్యాణ్ OG సినిమాలో పాడే అవకాశం కలిపిస్తారని చెప్పారు. నిన్న OG సినిమా నుంచి ఫైర్ స్టార్మ్ సాంగ్ రిలీజయింది. ఈ సాంగ్ ని శింబు, తమన్ తో పాటు నజీర్, భరత్ రాజ్ లు కూడా పాడారు. సాంగ్ టైటిల్స్ లో వారి పేర్లు కూడా చేర్చారు.
Also Read : OG Song : OG సాంగ్ లో ఇది గమనించారా..? దీని అర్ధం ఏంటో తెలుసా? సుజీత్ మామూలోడు కాదు..
దీంతో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ కి ఇచ్చిన మాటను తమన్ నిలబెట్టుకున్నాడని పలువురు అభినందిస్తున్నారు. మరి ఆ ఇద్దరు సింగర్స్ మున్ముంది ఇంకెన్ని సినిమాల్లో పాడతారో చూడాలి..