Jailer Collections : మూడు రోజుల్లో 200 కోట్లు పైనే.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న తలైవార్

జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజినీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పీరెన్స్ అదిరిపోయాయి. ఇక అనిరుద్ BGM జైలర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. తమిళనాడులోనే కాక అన్నిచోట్లా జైలర్ సినిమా భారీ విజయం సాధించింది.

Jailer Collections : మూడు రోజుల్లో 200 కోట్లు పైనే.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న తలైవార్

Rajinikanth Jailer Movie Collections crossed 200 Crores

Updated On : August 13, 2023 / 10:48 AM IST

Jailer Collections :  సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’(Jailer) సినిమా ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజినీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పీరెన్స్ అదిరిపోయాయి. ఇక అనిరుద్ BGM జైలర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. తమిళనాడులోనే కాక అన్నిచోట్లా జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. జైలర్ సినిమా మోదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. రెండో రోజు 56 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక మూడో రోజు 68 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది జైలర్ సినిమా.

Sunny Deol : బాడీలు పెంచడం కాదు.. యాక్టింగ్ చేయండి.. బాలీవుడ్ హీరోలపై సన్నీ డియోల్ వ్యాఖ్యలు..

దీంతో జైలర్ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 220 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ షేర్ 110 కోట్లపైనే కలెక్ట్ చేసింది. ఇప్పటికే చాలా చోట్ల జైలర్ సినిమా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెడుతుంది. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఇక నేడు ఆదివారం హాలిడే కావడం, అటు భోళా శంకర్ బోల్తా పడటం, సౌత్ లో పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో జైలర్ కి మరింత కలిసొస్తుంది. ఇదే ఊపు కంటిన్యూ చేస్తే జైలర్ ఇంకో రెండు రోజుల్లో 300 కోట్లు, వారంలో 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.