Coolie Collections
Coolie Collections : రజినీకాంత్ నాగార్జున మెయిన్ లీడ్స్ లో లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా నిన్న ఆగస్టు 14న రిలీజయి మిక్స్‌డ్ టాక్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాకు ఉన్న హైప్ తో, హాలిడేస్ ఉండటంతో బుకింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి. కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాదాపు 80 కోట్ల గ్రాస్ దాటేసింది.
తాజాగా బాక్సాఫీస్ సమాచారం ప్రకారం కూలీ సినిమా మొదటి రోజే తమిళ్ లోనే 60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది, తెలుగులో 10 కోట్లు, హిందీలో 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్లు, మిగతావి ఓవర్సీస్ నుంచి వచ్చినట్టు సమాచారం. అమెరికాలో అయితే కూలీ కలెక్షన్స్ దూసుకెళ్తుంది. ఇప్పటికే కూలీ సినిమా అమెరికాలో 3 మిలియన్ డాలర్స్ ని దాటేసింది. అంటే ఆల్మోస్ట్ 25 కోట్లకు పైగా గ్రాస్ అమెరికా నుంచే వచ్చింది.
Also Read : Ram Charan : ఈసారి నేషనల్ అవార్డు పక్కా.. చరణ్ – సుకుమార్ దానికి సీక్వెల్ ప్లాన్ చేశారట..
కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. దీంతో తమిళ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ మొదటి రోజు సాధించిన సినిమాగా కూలీ నిలవనుంది. ఈ కలెక్షన్స్ పై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఫుల్ లెంగ్త్ లో కూలీ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
ఇక కూలీతో పాటు పోటీగా రిలీజయిన వార్ 2 సినిమా వరల్డ్ వైడ్ 85 నుంచి 90 కోట్ల గ్రాస్ మొదటి రోజు వసూలు చేసినట్టు సమాచారం. ముందు నుంచి వార్ 2 కంటే కూలీ సినిమాకు హైప్ ఉన్న సంగతి తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా కూలీ 75 కోట్లు కలెక్ట్ చేస్తే వార్ 2 సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసింది. రిలీజ్ తర్వాత మాత్రం కూలీ కంటే వార్ 2 సినిమానే బెటర్ అంటున్నారు. మరి ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Also Read : Allu Aravind : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అంటూ..