Coolie Collections : మొదటి వీకెండ్ అయిపోయింది.. ‘కూలీ’ కలెక్షన్స్.. వార్ 2 కంటే ఎంత ఎక్కువ? బ్రేక్ ఈవెన్ ఎంత?

ముందు నుంచి కూలీ సినిమా ఫుల్ హైప్ తో ఉంది.

Coolie Collections

Coolie Collections : గత వారం ఆగస్టు 14న కూలీ, వార్ 2 సినిమాలు వరల్డ్ వైడ్ రిలీజయిన సంగతి తెలిసిందే. ఒకటి తమిళ్ సినిమా, ఒకటి బాలీవుడ్ సినిమా అయినా మన తెలుగు హీరోలు ఉండటంతో ఈ రెండు సినిమాలకు తెలుగులో మంచి హైప్ వచ్చి బిజినెస్ బాగానే జరిగింది. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. రెండూ యావరేజ్ గానే నిలిచాయి. అయితే నాలుగు రోజులు హాలీడేస్ రావడం, హైప్ ఉండటంతో కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి.

ముందు నుంచి కూలీ సినిమా ఫుల్ హైప్ తో ఉంది. కలెక్షన్స్ అడ్వాన్స్ సేల్స్ నుంచే అదరగొట్టింది. కూలీ సినిమా అడ్వాన్స్ సేల్స్ లోనే 80 కోట్లు రాబట్టింది. అడ్వాన్స్, మొదటి రోజూ కలుపుకొని కూలీ సినిమా 151 కోట్ల గ్రాస్ వసూలు చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది.

Also Read : Bollywood : బాలీవుడ్ వద్దు బాబోయ్.. పాపం చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు.. అందరూ దెబ్బ తిన్నవాళ్ళే..

ఇక ఈ నాలుగు రోజులు మొదటి వీకెండ్ అయిపోయే సమయానికి కూలీ సినిమా దాదాపు 385 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. కూలీ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 310 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ 620 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయాలి. అంటే ఇంకో 235 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే. తమిళ్ లో ఈ వారం సినిమాలేవీ లేకపోవడం కలిసొచ్చే అంశమే. వార్ 2 సినిమా నాలుగు రోజుల్లో దాదాపు 265 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే కూలీ సినిమా వార్ 2 కంటే ఆల్మోస్ట్ 120 కోట్లు ఎక్కువే కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

తమిళ్ సినిమా అయినా కూలీ తెలుగులో అదరగొట్టేసింది. కూలీ సినిమా తెలుగులో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో ఈ సినిమా 42 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయాల్సిందే ఈ సినిమా.

Also Read : Vijay – Rashmika : మొత్తానికి ఇద్దరూ ఒకేచోట.. న్యూయార్క్ లో విజయ్, రష్మిక.. అట్నుంచి అటు వెకేషన్?