Bollywood : బాలీవుడ్ వద్దు బాబోయ్.. పాపం చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు.. అందరూ దెబ్బ తిన్నవాళ్ళే..

అప్పట్లో మెగాస్టార్ నుంచి రీసెంట్ గా ఎన్టీఆర్ వరకు అందరూ బాలీవుడ్ కి వెళ్లి భంగపడ్డావాళ్లే.

Bollywood : బాలీవుడ్ వద్దు బాబోయ్.. పాపం చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు.. అందరూ దెబ్బ తిన్నవాళ్ళే..

Bollywood

Updated On : August 18, 2025 / 8:40 AM IST

Bollywood : సాధారణంగా హీరోయిన్స్ చాలా మంది సౌత్ లో స్టార్స్ గా ఎదిగి మెల్లిగా బాలీవుడ్ చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోతారు, వాళ్లకు అది కలిసి వస్తుంది కూడా. కానీ మన తెలుగు హీరోలు బాలీవుడ్ అంటే వద్దు అంటున్నారు. గెస్ట్ పాత్రలు, తెలుగు పాన్ ఇండియా సినిమాలు ఓకే కానీ డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలు మాత్రం వద్దంటున్నారు తెలుగు హీరోలు. అప్పట్లో మెగాస్టార్ నుంచి రీసెంట్ గా ఎన్టీఆర్ వరకు అందరూ బాలీవుడ్ కి వెళ్లి భంగపడ్డావాళ్లే.

90వ దశకంలో చిరంజీవి మెగాస్టార్ కి ఎదిగాక బాలీవుడ్ లో కూడా గుర్తింపు రావడంతో అక్కడికి వెళ్లి ప్రతి బంద్, ఆజ్ కా గూండారాజ్ సినిమాలు తీసి హిట్ కొట్టాడు. తర్వాత ది జెంటిల్ మెన్ సినిమా చిరుకి పెద్ద షాక్ ఇచ్చింది. అక్కడ హిట్స్ కొట్టినా ఇక్కడంత ఫేమ్ రాలేదు ఫ్లాప్ తో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చిరు బాలీవుడ్ సైడ్ చూడటం మానేసాడు.

Also Read : Vijay – Rashmika : మొత్తానికి ఇద్దరూ ఒకేచోట.. న్యూయార్క్ లో విజయ్, రష్మిక.. అట్నుంచి అటు వెకేషన్?

ఇక నాగార్జున శివ సినిమా హిందీలో కూడా హిట్ అవ్వడంతో వరసగా ద్రోహి, ఖుదా గవా, క్రిమినల్.. ఇలా పలు సినిమాల్లో హీరోగా, పలు సినిమాలో గెస్ట్ పాత్రలు చేసినా అంతగా బాలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయాడు కింగ్. దాదాపు హిందీలో నాగ్ 10 సినిమాలు చేసాడు. మొదట్లో కొన్ని హిట్ అయినా చివర్లో అగ్ని వర్ష భారీ ఫ్లాప్ చూసింది. ఫ్లాప్స్ రావడం, ఎన్ని సినిమాలు చేసినా టాలీవుడ్ లో ఉన్నంత స్టార్ డమ్ అక్కడ రాకపోవడంతో బాలీవుడ్ వద్దు అనుకోని వచ్చేసారు నాగ్. ఇటీవల బ్రహ్మాస్త్రలో గెస్ట్ రోల్ చేసినా బాలీవుడ్ లో మాత్రం ఆ పాత్రకు అంతగా గుర్తింపు రాలేదు.

ఇక మన వెంకీమామ తెలుగులో చంటి హిట్ అవ్వగా దాన్ని అనారి అని రీమేక్ చేసాడు. బాలీవుడ్ లో అది హిట్ అయింది. ఆ తర్వాత తక్ధీర్వాలా సినిమా చేస్తే డిజాస్టర్ గా మిగిలింది. మళ్ళీ బాలీవుడ్ లో వద్దనుకుని ఇక్కడే సెటిల్ అయిపోయాడు వెంకీమామ. సీనియర్స్ లో బాలయ్య మాత్రం బాలీవుడ్ ని తప్పించుకున్నాడు. పలువురు బాలయ్యతో బాలీవుడ్ లో సినిమాలు చేయాలనీ ప్రయత్నించినా బాలయ్య ఆసక్తి చూపించలేదు.

Also Read : Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రోమో చూశారా? ఈ కామన్ పీపుల్స్ నుంచే బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసేది..

ఈ తరం హీరోల్లో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాకు హైప్ ఉన్నా భారీ డిజాస్టర్ చూసాడు. మళ్ళీ చరణ్ అటు వైపు కూడా చూడలేదు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ చేసాడు. ఆ సినిమా ఎన్ని విమర్శలు, వివాదాలు చూసిందో అందరికి తెలిసిందే. కమర్షియల్ గా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 అని వెళ్ళాడు. యాక్షన్స్ బాగున్నా సినిమాలో కథ, కథనం రెగ్యులర్. రొటీన్ సినిమాగా వార్ 2 మిగిలింది. కమర్షియల్ గా కూడా యావరేజ్ గానే మిగిలేలా ఉంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అంతంతమాత్రమే నడుస్తుంది. YRF స్పై యూనివర్స్ లో వీక్స్ట్ ఫిలిం అని బాలీవుడ్ అంతా అంటుంది.

మహేష్ బాబు అసలు బాలీవుడ్ లో పని చేయను అని డైరెక్ట్ గానే చెప్పేసాడు. అల్లు అర్జున్ రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేస్తాడు అని వార్తలు వచ్చినా అవేవి వర్కౌట్ అవ్వలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ మధ్యలో మన డైరెక్టర్ తోనే బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తీసి చేతులు కాల్చుకున్నాడు. గతంలో సీనియర్స్ అరాకొరా హిట్స్ కొట్టినా స్టార్ డమ్, గుర్తింపు మాత్రం బాలీవుడ్ లో రాలేదు. ఇటీవల ఎన్టీఆర్ వార్ 2 ఈవెంట్లో డైరెక్ట్ గానే మా సౌత్ వాళ్ళు అక్కడికి వచ్చి పని చేస్తే అంతగా పట్టించుకోరు, కొంచెం తక్కువగానే చూస్తారు అని అన్నారు కూడా.

Also Read : TV Serials : హీరోయిన్ నన్ను కార్ తో గుద్దింది.. వామ్మో.. సీరియల్స్ లో ఇలా ఉంటారా? అక్కడ హీరోయిన్.. బయట ఏమో..

దీంతో మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ అంటే వద్దు బాబోయ్ అంటున్నారట. తమిళ దర్శకులు మనకు ఫ్లాప్స్ ఇస్తారు అనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలు చేస్తే కష్టమే అంటున్నారు. కావాలంటే మన తెలుగు సినిమాలను RRR, పుష్ప లాగా అక్కడ కూడా ప్రమోట్ చేసి పాన్ ఇండియా రిలీజ్ చేసి హిట్ కొట్టుకుందాం అంటున్నారు. మరి భవిష్యత్తులో డైరెక్ట్ బాలీవుడ్ కి వెళ్లి ఇంకే హీరో సినిమా చేస్తాడో చూడాలి.