Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రోమో చూశారా? ఈ కామన్ పీపుల్స్ నుంచే బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసేది..
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రోమో చూసేయండి..

Bigg Boss Agnipariksha
Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ త్వరలో మొదలవ్వనుంది. అయితే ఈ సారి సెలబ్రిటీలతో పాటు కామన్ పీపుల్స్ కూడా ఓ 5 గురు బిగ్ బాస్ లో అడుగుపెట్టబోతున్నారు.
బిగ్ బాస్ కి వచ్చిన మాములు జనాల ఎంట్రీల నుంచి 45 మందిని ఫైనల్ చేసి అందులో 5 గురిని సెలెక్ట్ చేయడానికి అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఆ అయిదుగురిని పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నవదీప్, అభిజీత్, బిందుమాధవి సెలెక్ట్ చేయనున్నారు.
Also Read : TV Serials : హీరోయిన్ నన్ను కార్ తో గుద్దింది.. వామ్మో.. సీరియల్స్ లో ఇలా ఉంటారా? అక్కడ హీరోయిన్.. బయట ఏమో..
తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు. త్వరలో ఇది ఆగస్టు 22 నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ అగ్నిపరీక్ష షో అయ్యాక, ఇందులో అయిదుగురిని సెలెక్ట్ చేసాక అప్పుడు సెలెబ్రిటీలతో కలిపి బిగ్ బాస్ మొదలవ్వనుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రోమో చూసేయండి..
Also See : Divi : ఉదయాన్నే జిమ్ లో దివి కసరత్తులు..