Vijay – Rashmika : మొత్తానికి ఇద్దరూ ఒకేచోట.. న్యూయార్క్ లో విజయ్, రష్మిక.. అట్నుంచి అటు వెకేషన్?
తాజాగా విజయ్ రష్మిక ఇద్దరూ కలిసి అమెరికాలో సందడి చేసారు.

Vijay - Rashmika
Vijay – Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అని రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉంటాయి. ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, విజయ్ ఇంట్లో రష్మిక ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం, ఒకరి సినిమా గురించి ఇంకొకరు ప్రేమగా పోస్టులు పెట్టుకోవడం, ఇద్దరూ కలిసి రెస్టారెంట్స్ కి వెళ్లడం.. ఇలా విజయ్, రష్మిక డైరెక్ట్ గా ఏమీ చెప్పకపోయినా హింట్స్ ఇస్తూనే ఉన్నారు.
దీంతో విజయ్ – రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అవుతున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించి చాలా రోజులైంది. తాజాగా విజయ్ రష్మిక ఇద్దరూ కలిసి అమెరికాలో సందడి చేసారు. న్యూయార్క్ లో ప్రతి సంవత్సరం అక్కడ ఉన్న ఇండియన్స్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ నిర్వహిస్తారని తెలిసిందే. ఆ పరేడ్ కి ఇండియన్ సెలబ్రిటీలు ఎవరో ఒకరు హాజరవుతారు.
ఈసారి న్యూయార్క్ లో జరిగిన ఇండియన్ పరేడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఇద్దరూ కలిసి పరేడ్ లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరి ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. మొత్తానికి ఇద్దరూ కలిసి కనిపించారని వీరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో సమ్మె జరుగుతుండటంతో సినిమా షూటింగ్స్ ఆగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా అది వాయిదా పడింది. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ కూడా వాయిదా పడింది. దీంతో ఇద్దరూ అమెరికాలో ఉన్నారు, ప్రస్తుతానికి షూటింగ్స్ లేవు కాబట్టి అట్నుంచి అటు అమెరికాలో వెకేషన్ కి వెళతారని సమాచారం.
Also Read : TV Serials : హీరోయిన్ నన్ను కార్ తో గుద్దింది.. వామ్మో.. సీరియల్స్ లో ఇలా ఉంటారా? అక్కడ హీరోయిన్.. బయట ఏమో..