ఇది పూర్వ జన్మ సుకృతం, మురుగదాస్‌తో సినిమా కోసం 15ఏళ్లుగా ప్రయత్నించా

ఇది పూర్వ జన్మ సుకృతం, మురుగదాస్‌తో సినిమా కోసం 15ఏళ్లుగా ప్రయత్నించా

Updated On : January 3, 2020 / 4:04 PM IST

రజనీ హీరోగా దర్బార్ వేడుక ఫుల్ జోష్‌తో అభిమానుల కేరింతలతో జరిగింది. రజనీ మాటల కోసం వేడుక ఆసాంతం ఆశగా ఎదురుచూశారు అభిమానులు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, హరీశ్ శంకర్, డైరక్టర్లు హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, మారుతీ కార్యక్రమానికి వచ్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా గురించి రజినీ అభిమానులతో పాటు మురుగదాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 
ప్రముఖులంతా మాట్లాడిన తర్వాత రజనీకాంత్ మాట్లాడుతూ.. అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇంత పెద్ద ఫంక్షన్ అనుకోలేదు. ఎప్పుడూ చిన్నగానే చేస్తూ ఉంటారు. ఈ సినిమా హిట్ అవుతుందని ముందుగానే తెలిసిపోయిందనుకుంటున్నా. 

1976లో అంతులేని కథ. నా తొలి సినిమా. అప్పట్నుంచి మీ అభిమానం. తమిళ వాళ్లు ఎంత ప్రేమిస్తారో తెలుగు వాళ్లు అంతే ప్రమేంచిచడం నా పూర్వ జన్మ సుక్రతం. మంచి సినిమా ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. సినిమా బాగుంది కాబట్టి బాగా ఆడింది కానీ, రజనీకాంత్ ఉన్నాడని కాదు. బాగున్న సినిమాలో రజనీ ఉన్నాడంతే. 

70ఏళ్లు అయినా ఇంకా హీరోగా చూస్తున్న మీ అభిమానమే నాకు ఎనర్జీ. చాలా మంది అడుగుతున్నారు. మీరు సంతోషంగా, ఎనర్జీగా ఎలా ఉంటారని.. వాళ్లకు నేను ఇదే చెప్తున్నా.. తక్కువగా ఆశపడండి. తక్కువ బాధపడండి. తక్కువగా నిద్రపోండి. తక్కువగా మాట్లాడండి. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం. 

మురుగదాస్ తో సినిమా తీయాలని 15ఏళ్లుగా అనుకున్నా. సుభాస్కరన్ ప్రొడక్షన్‌లో ఇప్పటికి కుదిరింది. బాహుబలి రానాతో మరో సినిమా చేస్తున్నారు. ఇలాంటి సబ్జెక్టును సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ, సినిమా తీసే విధానం బట్టే స్టోరీకి బలం వచ్చింది. ఇది మంచి ఎంటర్ టైన్ మెంట్ అవుతుంది. సినిమాకు పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు. అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్లండి వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అని తెలిపారు.