Rajinikanth takes highest Remuneration for Jailer Movie creates new record as highest paid actor in India Details Here
Rajinikanth Remuneration : రజనీకాంత్ ఏం చేసినా సెన్సేషనే. అసలు ఏం చెయ్యకపోయినా కూడా సెన్సేషనే. జస్ట్ అలా ఒక్క చూపు.. ఇలా ఒక్క అడుగు చాలు.. సినిమా 600కోట్లు కలెక్ట్ చేసేస్తుందనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. అంత కలెక్షన్ స్టామినా ఉంది కాబట్టే రజనీకాంత్ ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. లేటెస్ట్ గా జైలర్ సినిమా కోసం రజనీ తీసుకున్న 200 కోట్లతో ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్ గా రికార్డ్ సెట్ చేశారు రజనీ.
100 కోట్లు.. ఓ భారీ సినిమా తీసెయ్యొచ్చు. కానీ స్టార్ హీరోలు ఇప్పుడు 100కోట్లు రెమ్యూనరేషనే తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ యంగ్ స్టార్లు కొంతమంది 100 కోట్లు తీసుకుంటున్నారని టాక్ వస్తుండగా సీనియర్ హీరో రజనీకాంత్ కూడా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే జైలర్ తో మొత్తం లెక్కలే మార్చేశారు రజనీ. జైలర్ సినిమా కోసం 110 కోట్లు తీసుకున్న రజనీ లేటెస్ట్ గా ప్రాఫిట్స్ లో షేర్ మరో 100కోట్లు అందుకుని హయ్యస్ట్ పెయిడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు.
రోబో తర్వాత రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యి 650 కోట్ల కలెక్షన్లు దాటి 700కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు జైలర్. మరి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు, లాభాలు బాగా వచ్చినందుకు రజనీకాంత్ కి రిటర్న్ గిఫ్ట్ గా నిర్మాతలైన సన్ పిక్చర్స్ రెమ్యూనరేషన్ 100కోట్లు కాకుండా గిఫ్ట్ గా ఇంకో 100కోట్ల రూపాయల చెక్ తో పాటు BMW ఎక్స్ 7 కార్ గిఫ్ట్ గా ఇచ్చారు.
హిస్టారిక్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న రజనీకాంత్ కి చెన్నై మండవేలి బ్రాంచ్, సిటీ యూనియన్ బ్యాంక్ నుంచి 100కోట్ల చెక్ అందచేశారు నిర్మాత కళానిధి మారన్. రజనీకాంత్ జైలర్ కోసం 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారు. దీంతో పాటు ప్రాఫిట్ షేర్ మరో 100కోట్లు తీసుకుని 200కోట్ల హోల్ సమ్ రెమ్యూనరేషన్ తో ఇండియాలోనే ఎక్కవ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా టాప్ ప్లేస్ సంపాదించుకున్నారు రజనీ. ఆగస్ట్ 10న రిలీజ్ అయిన జైలర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 20రోజుల నుంచి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఈ రన్ ఇలాగే కంటిన్యూ అయితే ఈజీగా మరో 100కోట్లు రావచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మేకర్స్.
Jailer OTT Release Date : జైలర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. ప్లాట్‌ఫామ్ మారింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ వయసులో కూడా రజినీకాంత్ అలా సింపుల్ గా చూస్తూ, నడుస్తూ.. ఎలాంటి భారీ ఫైట్స్ చేయకుండానే కోట్లు కొల్లగొడుతున్నారు. అందుకే ఆయన్ని సూపర్ స్టార్ అనేది. ఎన్నేళ్లు అయినా, ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఆ రేంజ్ తరగదు.