Rajinikanth watched kannappa movie and his reaction is
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు టీజర్లు, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా కన్నప్ప చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు తెలియజేశారు.
Last night, @rajinikanth uncle watched #Kannappa. After the film, he gave me a tight hug. He told me that he loved #Kannappa.
I’ve been waiting 22 years as an actor for that hug!!!
Today, I feel encouraged. Humbled. Grateful. #Kannappa is coming on 27th June and I can’t wait… pic.twitter.com/HDYlLuDsdc
— Vishnu Manchu (@iVishnuManchu) June 16, 2025
‘రజినీకాంత్ అంకుల్ కన్నప్ప మూవీ చూశారు. ఆ తర్వాత.. నన్ను గట్టిగా కౌగిలించుకుని.. సినిమా నచ్చిందని చెప్పారు. ఓ నటుడిగా ఆ హగ్ కోసం నేను 22 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అని విష్ణు రాసుకొచ్చారు.’ రజినీకాంత్‌తో దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు.