Director Maruthi : నాతో సినిమా చేయొద్దని ప్రభాస్ కి చెప్పారు.. ప్రభాస్ ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టమని అడిగాడు..
నేడు ది రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ చేసి ఈవెంట్ నిర్వహించారు.

Director Maruthi Speech in Prabhas The Raja Saab Movie Teaser Launch Event
Director Maruthi : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ది రాజాసాబ్ సినిమా తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేడు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. యువీ వంశీ ఒకరోజు వచ్చి నువ్వు ప్రభాస్ తో సినిమా చేస్తావా అని అడిగారు. అప్పుడు నేను గోపీచంద్ తో సినిమా చేస్తున్నాను. అలాంటి అవకాశం వస్తే నేనెందుకు చేయను అన్నాను. ముంబై వెళ్లి ప్రభాస్ ని కలిసాను. నా ప్రేమకథ చిత్రం, భలేభలే మొగాడివోయ్ సినిమాలకు ప్రభాస్ పిచ్చ ఫ్యాన్ అని చెప్పాడు. నాకు అలాంటి సినిమా కావాలి అన్నారు. నేను అండి అని పిలుస్తుంటే డార్లింగ్ అని పిలవమన్నారు. నా పక్కా కమర్షియల్ సినిమా ఫెయిల్ అయింది. నాకు కమిట్ అయిన నిర్మాత పక్కకు తప్పుకున్నాడు. దాంతో ప్రభాస్ తో ఇప్పుడు సినిమా చేయకూడదు అనుకున్నా. వంశీకి ఫోన్ చేసి చెప్పా. కానీ సాయంత్రం ప్రభాస్ ఫోన్ చేసి నేను చెప్పిన కథ బాగుంది అన్నారు. ఆయన నమ్ముతున్నాడు అని రెండు రోజులు ఆలోచించి సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యా.
Also Read : Prabhas : ‘రాజాసాబ్’లో ప్రభాస్ తాత కాదా? టీజర్ లో తాత మారిపోయాడేంటి..
ప్రభాస్ కి ఇప్పుడు ఉన్న ఇమేజ్ లో కామెడీ ఎలా చేస్తాడు అని అందరికి డౌట్స్ ఉన్నాయి. మా ఇంట్లో కూడా ప్రభాస్ తో సినిమా చేస్తున్నావా అని అడిగారు. అందరూ ప్రభాస్ గారితో మారుతితో ఇప్పుడు సినిమా ఎందుకు అని అడిగేవాళ్లు. కానీ ఆయన నమ్మారు నన్ను. నిన్న రాత్రి 2 గంటలకు ప్రభాస్ ఫోన్ చేసి నాతో అరగంట మాట్లాడారు టీజర్, రెస్పాన్స్ గురించి. మీ మీమ్స్ అన్ని నేను ప్రభాస్ కి చూపిస్తా. మీ కంటే వెయ్యి రేట్లు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సినిమా గురించి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడతారు. ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు. నేను, ప్రభాస్ కలిసి వింటేజ్ డార్లింగ్, బుజ్జిగాడు ని చూపిద్దామని ఫిక్స్ అయ్యాం. హీరోయిన్ తో రొమాన్స్ చేసి చాలా రోజులైంది బాహుబలి తర్వాత హీరోయిన్ తో కరెక్ట్ సీన్స్ పడలేదు సినిమాలో ఒక ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టమని ప్రభాస్ అడిగారు. ఆయన అడిగాడని ముగ్గురుని పెడతా అని చెప్పా. రొమాంటిక్ ఫాంటసీ హారర్ కామెడీ సినిమా చూపిస్తున్నా. ఇది టీజర్ మాత్రమే ట్రైలర్, సినిమా మీరు ఊహించలేరు. ఇంకా కొంత షూట్ బ్యాలెన్స్ ఉంది. ఒక సాంగ్ ఉంది అని తెలిపారు.
Also Read : The Raja Saab : ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్ వచ్చేసింది..