Prabhas : ‘రాజాసాబ్’లో ప్రభాస్ తాత కాదా? టీజర్ లో తాత మారిపోయాడేంటి..
ప్రభాస్ మొదటిసారి తాత గెటప్ వేస్తుండటంతో, ప్రభాస్ డ్యూయల్ రోల్ అని సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

After Prabhas Old Getup Glimpse Now Sanjay Dutt old Getup in Raja Saab Teaser
Prabhas : ప్రభాస్ హారర్ కామెడీ సినిమా రాజాసాబ్ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా నేడు టీజర్ రిలీజ్ చేసారు. అయితే ప్రభాస్ తాత గెటప్ లో ఉన్న గ్లింప్స్, పోస్టర్స్ గతంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ మొదటిసారి తాత గెటప్ వేస్తుండటంతో, ప్రభాస్ డ్యూయల్ రోల్ అని సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.
కానీ నేడు రిలీజ్ చేసిన టీజర్ లో సంజయ్ దత్ తాత పాత్రలో కనపడ్డాడు. ప్రభాస్ ఒకటే గెటప్ లో కనపడ్డాడు. దీంతో అదేంటి ప్రభాస్ తాత అన్నారుగా, ఇప్పుడు సంజయ్ దత్ తాత పాత్రలో కనిపిస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
Also Read : The Raja Saab : ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్ వచ్చేసింది..
అయితే టీజర్ చూస్తుంటే.. సినిమాలో సంజయ్ దత్ తాత పాత్ర. తన ఆస్తిని చనిపోయాక కూడా తానే అనుభవించాలని అనుకుంటాడు. అక్కడికి ప్రభాస్ రావడంతో అతనిలోకి సంజయ్ దత్ పాత్ర ఆత్మ దూరడంతో ప్రభాస్ అలా తాత పాత్రగా బిహేవ్ చేస్తాడేమో అని తెలుస్తుంది.
టీజర్ తో రాజాసాబ్ సినిమాలో సంజయ్ దత్ తాత పాత్ర చేస్తున్నాడని, ఆ తాత ఆత్మ ప్రభాస్ పాత్రలో దూరినపుడు ప్రభాస్ కూడా తాత గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. టీజర్ ఇక్కడ చూసేయండి..
గతంలో రిలీజ్ చేసిన ప్రభాస్ తాత గెటప్ గ్లింప్స్..