Suhas – Keerthy Suresh : మహానటితో సుహాస్ ఓటీటీ మూవీ.. టైటిల్, ఫస్ట్ లుక్ అదిరిందిగా.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో?
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్, టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.

Suhas Keerthy Suresh OTT Movie Streaming Date and Platform Details
Suhas – Keerthy Suresh : షార్ట్ ఫిలిమ్స్ నుంచి కెరీర్ మొదలుపెట్టిన సుహాస్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సుహాస్ మహానటి కీర్తి సురేష్ తో కలిసి ఓ ఓటీటీకి సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడకషన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్, టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.
సుహాస్ – కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న సినిమాకు ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్ పెట్టారు. రిలీజ్ చేసిన పోస్టర్ లో సుహాస్ వెంట కీర్తి సురేష్ పడుతుంది. ఈ పోస్టర్ చూస్తుంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమాలా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ ఉప్పు కప్పురంబు సినిమా జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించారు. మరి సుహాస్ – కీర్తి సురేష్ కలిసి ఏ రేంజ్ లో ఉప్పు కప్పురంబుతో మెప్పిస్తారో చూడాలి. ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ బాబు మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Also Read : Janhvi Kapoor : ‘జాన్వీ కపూర్’ ని అంత మాట అనేశాడేంటి.. మానస్ పై జాన్వీ ఫ్యాన్స్ ఫైర్..
ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మాణంలో వసంత్ మారింగంటి ఈ కథ రాయగా ఐ.వి. శశి దర్శకత్వంలో తెరకెక్కినది ఈ సినిమా. 1990ల నాటి బ్యాక్ డ్రాప్ తో లోతట్టు ప్రాంతంలోని చిట్టి జయపురం అనే ఓ విలేజ్ కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.