Coolie : ‘కూలి’ ఫస్ట్ హాఫ్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫిదా..
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీ సినిమా నుంచి రోజుకో అప్డేట్ బయటికి వస్తోంది

Rajinikanth watches Coolie first half and his reaction viral
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీ సినిమా నుంచి రోజుకో అప్డేట్ బయటికి వస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ హాఫ్ రెండు నెలల ముందే లాక్ చేశారట. తలైవా రజనీకాంత్ ఈ ఫస్ట్ హాఫ్‌ను చూసి ఫిదా అయ్యారని అంటున్నారు.
కూలీ మూవీలో దేవా అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో రజినీకాంత్ కనిపించనున్నారు. ఇది గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని టాక్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో రజనీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్ కాస్ట్ ఉంది.
Allam Gopala Rao : విషాదం.. ప్రముఖ సినీ, టీవీ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూత..
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ కూడా కూలీ సినిమాలో ఇంపార్టెంట్ కామియో రోల్‌లో కనిపించనున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌తో ఈ సినిమాకు లింక్ ఉంటుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు.
అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న కూలీ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, పోస్టర్స్ ఫ్యాన్స్‌లో హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. రజనీ స్టైల్, స్వాగ్, లోకేశ్ కనగరాజ్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుందన్న అంచనాలున్నాయి. ఆగస్ట్ 14, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న కూలీ కోసం ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.