అడవిలో సూపర్ స్టార్.. బేర్ గ్రిల్స్‌తో రజనీ వైల్డ్ లుక్ కిరాక్..!

  • Publish Date - February 19, 2020 / 06:47 PM IST

సాహసవీరుడు, టీవీ వ్యాఖ్యాత బేర్ గ్రిల్స్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ వైల్డ్ లుక్ కిరాక్ పుట్టిస్తోంది. రాబోయే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్‌లో రజనీకాంత్ కనిపించనున్నాడు. డిస్కవరీ ఛానెల్ లో ఈ వైల్డ్ షో త్వరలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బేర్ గ్రిల్స్, రజనీ కలిసి ఉన్న మోషన్ పోస్టర్‌ను గ్రిల్స్ తన ట్విటర్ట్ అకౌంట్లో షేర్ చేశాడు.

‘ప్రపంచంలో ఇప్పటివరకూ ఎందరో  నటులతో కలిసి పనిచేశాను. కానీ, రజనీ మాత్రం నాకు ఎంతో స్పెషల్.. లవ్ ఇండియా.. #ThalaivaOnDiscovery అని హ్యాష్ ట్యాగ్ కూడా జతచేశాడు. ప్రధాని నరేంద్ర మోడీతో వైల్డ్ షో చేసిన తర్వాత మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో బేర్ గ్రిల్స్ తో రజనీ కాంత్ కనిపించనున్నాడు. రజనీకాంత్‌ బుల్లితెరపై తొలిసారి కనిపించనున్నాడు. 

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోలో భాగంగా బేర్‌ గ్రిల్స్‌తో కలిసి నెల క్రితమే రజనీ అడవిబాట పట్టాడు. అక్కడే రెండు రోజులపాటు వన్య మృగాల ఆవాసంలో గడిపాడు. దీనికి సంబంధించి ఎపిసోడ్ షూటింగ్ పూర్తియింది. త్వరలో డిస్కవరీ ఛానెల్ లో రజనీ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

దీనికి ముందుగానే బేర్ గ్రిల్స్‌తో రజనీ అడ్వెంచర్ వైల్డ్ జర్నీకి సంబంధించి ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. అడవిలో ఓ మార్గంలో జీప్ దగ్గర రజనీ, గ్రిల్స్ నిలబడి ఉన్న లుక్ కిరాక్ పుట్టిస్తోంది. అడ్వెంచర్ థీమ్ బ్యాగ్రౌండ్‌లో రజనీ లుక్ అదిరిపోయింది. 15 సెకన్ల నిడివి గల ఈ మోషన్ పోస్టర్ వీడియోను గ్రిల్స్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.

డిస్కవరీ చానెల్‌లో ఈ షో త్వరలో ప్రసారం కానున్న నేపథ్యంలో.. రజనీ, బేర్‌ గ్రిల్స్‌ ఫస్ట్‌ లుక్‌ బయటికొచ్చింది. అడవిలోని ఓ దారి పక్కన టాప్‌లెస్‌ జీప్‌ను ఆనుకుని ఉన్న రజనీ, గ్రిల్స్‌ లుక్‌ అదిరిపోయింది. అడ్వంచర్‌ థీమ్‌తో బ్యాగ్రౌండ్‌లో అగ్ని కీలలు, నిప్పు కణికలతో ఉన్న ఇద్దరి క్లోజప్‌ సరికొత్త అనుభూతి కలిగిస్తోంది.

15 సెకండ్ల నిడివి గల ఈ మోషన్‌ పోస్టర్‌ను గ్రిల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ జరిగింది. షూటింగ్‌ చేస్తున్న క్రమంలో రజనీకి స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే.

బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని మోడీ ఎపిసోడ్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. టెలివిజన్ చరిత్రలో మోడీ ఎపిసోడ్‌కు 3.6 బిలియన్ల ఇంప్రెషన్స్ వచ్చి పడ్డాయి. ఇప్పుడు గ్రిల్స్ కు జోడీగా సూపర్ స్టార్ రజనీ జాయిన్ అయ్యారు.