Rajmouli-Mahesh Movie Based on Real Life Story
Rajmouli-Mahesh Movie: భారతదేశపు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తాజా చిత్రం “RRR” విజయంతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాను ఆస్కార్‌కి తీసుకెళ్లేందుకు.. అమెరికాలో పర్యటిస్తూ, పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు హాజరవుతున్నాడు. ఆ వేడుకలలో “RRR” మరియు తన భవిష్యత్తు ప్రాజెక్టులను గురించి చర్చిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ని పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.
Maheshbabu : ‘లవ్ స్టోరీ’తో మహేష్ బాబుకి లాభం
ఇక రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతున్న విషయం మనందరకి తెలిసిందే. ఈ సినిమా గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ చిత్రంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించాడు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ కాస్ట్ కూడా నటిస్తున్నారని అంటున్నారు. కాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమా గురించి కీలక విషయం బయటపెట్టాడు.
ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రాబోతున్నట్టు అయన వెల్లడించాడు. వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించేలా భారీ స్థాయిలో ఉంటుందట. అలాగే ఈ చిత్రంలో కథానాయికగా దీపికా పదుకొణె ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.