Raju Gari Dongalu : ‘రాజు గారి దొంగలు’ రిలీజ్ ఎప్పుడంటే..
దొంగతనం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

Raju Gari Dongalu Movie Release Date Announced
Raju Gari Dongalu : లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రాజు గారి దొంగలు’. నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మాణంలో లోకేష్ రనాల్ హిటాసో దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Also Read : Rajinikanth : వాట్.. రజినీకాంత్ సినిమా ఓటీటీకి అన్ని కోట్లకు అమ్ముడయిందా?
కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఇది నోట్ల రద్దు ముందు సినిమా అని తెలుస్తుంది. రాజుగారి దొంగలు సినిమా మార్చి 21న థియేటర్స్ లో విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. దొంగతనం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.