×
Ad

Director Saailu : సినిమా హిట్ అవ్వకపోతే కట్ డ్రాయర్ మీద పరిగెడతా.. డైరెక్టర్ ఛాలెంజ్..

తాజాగా ఓ కొత్త దర్శకుడు చేసిన ఛాలెంజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. (Director Saailu)

Raju Weds Rambai

Director Saailu : ఇటీవల పలువురు హీరోలు, దర్శకులు తమ సినిమాల మీద కాన్ఫిడెంట్ తో ఛాలెంజ్ లు విసురుతున్నారు. ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడానికి ఇదొక కొత్త టెక్నిక్ కనిపెట్టారు. ఇటీవల నాని కోర్ట్ సినిమా హిట్ అవ్వకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి అన్నాడు. త్రిబాణధారి బార్బరీక్ సినిమా హిట్ అవ్వకపోతే చెప్పుతో కొట్టుకుంటా అన్నాడు డైరెక్టర్. ఇటీవల ప్రియదర్శి కూడా మిత్రమండలి హిట్ అవ్వకపోతే నెక్స్ట్ సినిమా చూడకండి అన్నాడు.(Director Saailu)

ఇలా పలువురు హీరోలు, దర్శకులు ఈ మధ్య ఛాలెంజ్ లు చేస్తున్నారు. తాజాగా ఓ కొత్త దర్శకుడు చేసిన ఛాలెంజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also See : Sathya Sai Baba Centenary Celebrations : సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు.. పాల్గొన్న మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఫొటోలు..

తెలంగాణలోని ఓ గ్రామంలో జరిగిన నిజమైన ప్రేమకథను తీసుకొని రాజు వెడ్స్ రాంబాయి సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సాయిలు. ఈ సినిమా నవంబర్ 21 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్లో దర్శకుడు సాయిలు మాట్లాడుతూ.. మీకు ఈ సినిమా నచ్చకపోతే చూసి వదిలేయండి కానీ నెగిటివ్ ప్రచారం చేయకండి. మీకు నచ్చకపోతే క్షమించండి కానీ సినిమా గురించి నెగిటివ్ చేయొద్దు. సినిమా 21న రిలీజ్ అయ్యాక నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పెట్ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఉరుకుతా. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే దయచేసి అర్ధం చేసుకోండి. మీరు ఊరోళ్లు అయితే ఈ సినిమా చూస్తే మీ ఊరు గుర్తొస్తుంది. ఊరు ఎమోషన్ ఉంటుంది సినిమాలో. మీకు మీ ప్రేమలు గుర్తుకొస్తాయి. సినిమాని పొగడకపోయినా పర్లేదు నెగిటివ్ టాక్ మాత్రం తీసుకురావొద్దు. మీకు దండం పెడతా. ఈ సినిమాకు చాలా మంది కష్టం ఉంది అని అన్నారు. దీంతో ఈ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈ రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : Bellamkonda Sreenivas : మహేష్ బాబు కంటే ముందే బెల్లం బాబు.. ఆ హీరోలు కూడా..