Rakhi Sawant : బిగ్‌బాస్‌ సెట్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా.. కుక్కలు వెంటపడ్డాయి..!

వెరైటీ డ్రెస్ వేసుకొని బిగ్‌బాస్‌ సెట్ లోకి ఎంట్రీ ఇస్తుండగా.. నటి వెంట కుక్కలు పడ్డాయి. దీంతో ఆమె బయపడి పోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Rakhi Sawant

Rakhi Sawant : నటి రాఖీ సావంత్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. బిగ్‌బాస్‌ కి రాకముందు ఈమె గురించి పెద్దగా తెలియదు. ఎప్పుడైతే బిగ్‌బాస్‌ సీజన్ 14లో పాల్గొన్నారో.. నాటి నుంచి ఈమె పేరు మరోమోగిపోయింది. బిగ్‌బాస్‌లో పోటీ దారులకు దడపుట్టించారు. అంతేకాదు ఎంటర్‌టైన్మెంట్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించారు. కానీ చివరివరకు నిలవలేకపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే తనను బిగ్‌బాస్‌ సీజన్ 15లో తీసుకోవాలని ముంబై విధుల్లో వినూత్న నిరసన చేసింది.

 

ఈమె నిరసనకు దిగొచ్చిన బిగ్‌బాస్‌ యాజమాన్యం ఈ సీజన్‌ ఓటీటీలోనూ రాఖీకి అవకాశం కల్పించారు. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్‌ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కాస్త ఎక్కువగానే ముస్తాబై వచ్చారు. భారీ డ్రెస్ వేసుకొని కారు దిగి నడుచుకుంటూ సెట్ లోకి వెళ్తుండగా.. ఆమెను కుక్కలు వెంబడించాయి. దీంతో రాఖీ భయపడిపోయింది.

ఇక దీనికి సంబందించిన వీడియోను రాఖీ సావంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని కరవకుండా వదిలేశాయి.. ఆ కుక్కలు చాలా మంచివి అనుకుంటా.. కరిచి ఉంటే సెట్ కంటే ముందు హాస్పిటల్ కి వెల్లవారు అని కొందరు కామెంట్స్ చేస్తే.. డ్రెస్ మోయడానికి ఓ అటెండర్ ని పెట్టుకోవాల్సింది అని మరికొందరు అంటున్నారు.