Rashmika : రష్మిక ఫేక్ వీడియో పై మాట్లాడిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్..

రష్మిక ఫేక్ వీడియో పై మాట్లాడిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి. ఏమన్నారో తెలుసా..?

Rashmika : రష్మిక ఫేక్ వీడియో పై మాట్లాడిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్..

Rakshit Shetty about Rashmika Mandanna Deepfake video

Updated On : November 16, 2023 / 11:50 AM IST

Rashmika Mandanna : ఇటీవల రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో నేషనల్ వైడ్ చాలా బిగ్ టాపిక్ అయ్యింది. ఆ వీడియో పై సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాంటి యాక్షన్స్ పై గవర్నమెంట్ దృష్టి పెట్టాలంటూ వ్యాఖ్యానించారు.

దీంతో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దీని పై రియాక్ట్ అవుతూ సోషల్ మీడియా వేదికలకు కొత్త రూల్ రిమైండర్లను పంపింది. ఆ నిబంధనలుని అధిగమిస్తే జైలు శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా కూడా విధించబడుతుందని స్పష్టం చేసింది.

కాగా రష్మికకి ఎదురైన ఈ విషయం గురించి ఆమె ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి మాట్లాడారు. ఆయన నటించిన ‘సప్త సాగరాలు దాటి సైడ్ B’ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రక్షిత్ వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షిత్ ని రష్మిక ఫేక్ వీడియో గురించి ప్రశించారు. అందుకు సంబంధించిన ప్రోమో వీడియో రిలీజ్ అయ్యింది.

Also read : Balakrishna : నాది, పవన్ కళ్యాణ్ ది ఒకటే భావజాలం.. దేనికీ భయపడని వ్యక్తిత్వం : ఎమ్మెల్యే బాలకృష్ణ

ఆ ప్రోమోలో రక్షిత్ శెట్టి కామెంట్స్.. “ఇలాంటి వాటి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్‌వేర్ కి లైసెన్స్ కంపల్సరీ అనే రూల్ తీసుకు రావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ అందరికి అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ముందుగా అరికట్టాలి” అంటూ చెప్పుకొచ్చారు. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ.. “ఆమె చాలా పెద్ద కలలు ఉన్న అమ్మాయి” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

‘కిరాక్ పార్టీ’ చిత్రం కలిసి నటించిన వీరిద్దరూ.. ఆ సమయంలోనే ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్లారు. 2017లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో 2018లో తమ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకొని కెరీర్ లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కెరీర్ లో సూపర్ సక్సెస్ లు అందుకుంటూ స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.