Balakrishna : నాది, పవన్ కళ్యాణ్ ది ఒకటే భావజాలం.. దేనికీ భయపడని వ్యక్తిత్వం : ఎమ్మెల్యే బాలకృష్ణ

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. పవన్ కళ్యాణ్ యజ్ఞంలో సమిధ కావడానికి ముందుకొచ్చారని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

Balakrishna : నాది, పవన్ కళ్యాణ్ ది ఒకటే భావజాలం.. దేనికీ భయపడని వ్యక్తిత్వం : ఎమ్మెల్యే బాలకృష్ణ

Balakrishna Appreciate Pawan Kalyan

Balakrishna – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు, తనకు ఎంతో సారూప్య కథ ఉందని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ కు తనది ఒకటే భావజాలం అన్నారు. తాను, పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతామని చెప్పారు. తమది ఎవర్నీ లెక్క చేయని తత్వమని, దేనికీ భయపడని వ్యక్తిత్వం అన్నారు. తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. పవన్ తమతో కలసి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ యజ్ఞంలో సమిధ కావడానికి ముందుకొచ్చారని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్పారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని పేర్కొన్నారు. జై టీడీపీ.. జై జనసేన అంటూ బాలకృష్ణ నినాదాలు చేశారు. జనసేన, టీడీపీ కలయిక కొత్త శకానికి నాంది పలికినట్టేనని పేర్కొన్నారు. సీట్ల లెక్క కాదు.. రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలకు తాము, జనసైనికులం రక్షక భటులుగా ఉంటామని హామీ ఇచ్చారు.

Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం.. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ

వైసీపీ సామాజిక బస్సుయాత్రలో మహానీయుల ఫొటోలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. పూలే లాంటి వారి ఫొటోలు కింద.. వైసీపీ నాయకుల ఫొటోలు పైన ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర పాలన నేరస్థుల చేతుల్లోకి వెళ్ల కూడదన్నదే తమ ఉద్దేశ్యం అన్నారు. సీఎం జగన్ సహా వైసీపీ వారంతా ఆవు తోలు కప్పుకున్న పులులు అని విమర్శించారు. ఎవర్నీ ఉపేక్షించేది లేదని ఇక జరగబోయేది ఉద్యమమేనని పేర్కొన్నారు. ప్రజలంతా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

వైసీపీ నాయకులను ఎక్కడెక్కడ ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, చివరకు గాలి మీద కూడా పన్ను వేస్తారని విమర్శించారు. అమరావతి ఉద్యమకారులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నారని, అసలైన పెయిడ్ ఆర్టిస్టులు విశాఖ సమ్మిట్ లో పాల్గొన్నవారేనని చెప్పారు. లక్షలకు లక్షలు సలహాదారులకు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన ఇష్టానురాజ్యంగా జరుగుతుందన్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఒక పని కూడా జరగట్లేదన్నారు.

Pawan Kalyan : తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

హిందూపురంలో వైసీపీ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. హిందూపురంలో తన సొంత నిధులు, పార్టీ నిధులతో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయని చెప్పారు. టీడీపీ, జనసేన కలవడం ఒక కీలకమైన ఘట్టంగా పేర్కొన్నారు. గతంలో ఎన్టీ రామారావు కూడా పార్టీలన్నింటినీ ఏకం చేసి అన్యాయంపై తిరుగుబాటు చేశారని తెలిపారు.