Pawan Kalyan : తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయటానికి సిద్ధమవుతు్నారు.

Pawan Kalyan Election Campaign In Telangana
Pawan Kalyan Election Campaign In TS : తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎన్డీయేతో భాగస్వామిగా కొనసాగుతున్న పవన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని తెలుస్తోంది.
కాగా..ఏపీ రాజకీయాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టిన జనసేనాని తెలంగాణలో కూడా పోటీకి సిద్ధం కావటం..బీజేపీతో పొత్తు..తమకు కేటాయించే సీట్ల గురించి చర్చ ఇదంతా రసవత్తరంగా మారింది. జనసేన మొదట్లో తమకు 20కి పైగా సీట్లు అడిగింది. కానీ బీజేపీ మాత్రం కేవలం ఎనిమిది మాత్రమే కేటాయించింది. సాధారణంగా జనసేన ఏపీపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ తెలంగాణలో కూడా పోటీకి దిగటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జనసేన తమకు కేటాయించిన నియోజకవర్గాలకు అభ్యర్ధులను కూడా ప్రకటించింది. వారి తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు.
గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న 43మంది అభ్యర్ధులు
ఈ క్రమంలో ఇక జనసేనానికి కూడా ప్రచారం రంగంలోకి దిగనుండటం తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. జనసేన అభ్యర్ధుల కోసమే కాకుండా బీజేపీ అభ్యర్ధుల తరపున పవన్ ప్రచారం చేయనున్నారు. దీంతో బీజేపీలో సరికొత్త జోష్ నెలకొందని చెప్పాలి.
తెలంగాణలో తమకు అధికారం ఇస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని కానీ బీజేపీ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం తమకు ఓట్లు వేసి గెలిపిస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతోంది.
మరో ఛాన్స్ ఇస్తే దేశంలోనే నెంబర్ వన్ చేస్తా- కేటీఆర్
కాగా..బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి వరకు విమర్శలు, ప్రతివిమర్శలుగా కొనసాగుతున్నాయి. ఇక పవన్ కల్యాణ్ ప్రచారం ఎలా చేయనున్నారు..? ఏ పార్టీపై విమర్శలు చేస్తారు..? అనే విషయం ఆసక్తికరంగా మారింది.