Rakul – Mehreen : స్లిమ్ బ్యూటీస్.. ఇలా చిక్కిపోతున్నారేంటి..

అంతకు ముందు కాస్త ముద్దుగా బొద్దుగా ఉండే ఈ హీరోయిన్లు అసలు గుర్తు పట్టకుండా తయారైపోయారు.. నెలలు తరబడి వర్కవుట్స్ చేస్తూ.. పోటీపడి మరీ జీరో సైజ్‌కి మారిపోయారు..

Rakul – Mehreen : స్లిమ్ బ్యూటీస్.. ఇలా చిక్కిపోతున్నారేంటి..

Rakul Mehreen

Updated On : July 22, 2021 / 3:08 PM IST

Rakul – Mehreen: హీరోయిన్ అంటే స్క్రీన్ మీద స్లిమ్‌గా ఉండాలి, ఎట్రాక్టివ్‌గా ఉండాలి, ఎప్పుడూ ఫిట్‌నెస్ మెయింటెన్ చెయ్యాలని సినిమా ఇండస్ట్రీలో సో కాల్డ్ రూల్. అందుకే అంతకు ముందు కాస్త ముద్దుగా బొద్దుగా ఉండే ఈ హీరోయిన్లు అసలు గుర్తు పట్టకుండా తయారైపోయారు. నెలలు తరబడి వర్కవుట్స్ చేస్తూ.. పోటీపడి మరీ జీరో సైజ్‌కి మారిపోయారు.

Rakul Mehreen

 

హీరోయిన్లంటే సో కాల్డ్ గ్లామర్ కాదు యాక్టింగ్ టాలెంటే ఇంపార్టెంట్ అని సో కాల్డ్ హీరోయిన్లు స్లోగన్స్ ఇస్తుంటే.. కొంతమంది మాత్రం తమ ఫిజిక్ కోసం మరీ స్లిమ్ అయిపోయి జీరో సైజ్ మెయింటెన్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ముద్దుగా బొద్దుగా ఉన్న షాలినీ పాండే.. అసలు ఇప్పుడు గుర్తుపట్టలేకుండా తయారరైంది. పెద్దగా లావుగా లేకపోయినా క్యూట్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడసలు మరీ సన్నగా తయారై షాకిచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Shalini (@shalzp)

‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ సినిమాల్లో ముద్దుముద్దుగా కనిపించిన మెహరీన్ తర్వాత కాస్త లావైంది. మరి తన ఫిజిక్ వలనేనేమో పెద్దగా ఆఫర్లు రావట్లేదని ఫీలయిందేమో.. స్లిమ్ వ్రతం చేసి మరీ సన్నగా అయిపోయింది. అంతకుముందు క్యూట్‌గా కనిపించిన ఈ భామ ఇప్పుడు చాలా స్లిమ్ అయిపోయి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN ?? (@mehreenpirzadaa)

ఫస్ట్ నుంచి ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. ఈ మధ్య మరీ మితిమీరి వర్కవుట్స్ చేస్తున్నట్టుంది.. అందుకే మరీ పేషెంట్‌లా తయారైందని, ఇక వయసైపోయింది.. సినిమాల నుంచి రిటైర్ అవ్వమని, ఓల్డ్ లుక్ వచ్చేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. రకుల్ ప్రీత్ ఈ మధ్య మరీ స్లిమ్ అయిపోయిన ఫోటోస్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఇక ముందుముందు కనిపించకుండా పోతావేమో అంటూ సరదాగా జాగ్రత్తలు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)