Rakul Preet Singh : ఆ హీరోతో కిస్ సీన్స్ చేసినందుకే టాలీవుడ్ లో నాకు అవకాశాలు రాలేదు.. నాగార్జునపై రకుల్ కామెంట్స్?
బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ రకుల్ అసలు సౌత్ సినిమాలు చెయ్యట్లేదు, మధ్యలో ఒకటో రెండో చేసినా అవి పరాజయం పాలయ్యాయి. దీంతో సౌత్ సినిమాల వంక కూడా చూడట్లేదు రకుల్. తాజాగా రకుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ లో తనకి అవకాశాలు రావట్లేదని చెప్పింది. అందుకు చెప్పిన కారణం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Rakul Preet Singh indirect comments on Nagarjuna for not coming offers in south
Nagarjun : తెలుగులో కెరటం సినిమాతో పరిచయమై ఆ తర్వాత వరుస హిట్స్ పడటంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పీక్ టైంలో ఉన్నప్పుడే బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో అక్కడికి చెక్కేసింది రకుల్. ఇక అప్పటి నుంచి సౌత్ సినిమాలవైపు చూడటమే మానేసింది. బాలీవుడ్ లో సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి రకుల్ కి. ప్రస్తుతం రకుల్ చేతిలో మరో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.
అయితే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ రకుల్ అసలు సౌత్ సినిమాలు చెయ్యట్లేదు, మధ్యలో ఒకటో రెండో చేసినా అవి పరాజయం పాలయ్యాయి. దీంతో సౌత్ సినిమాల వంక కూడా చూడట్లేదు రకుల్. తాజాగా రకుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ లో తనకి అవకాశాలు రావట్లేదని చెప్పింది. అందుకు చెప్పిన కారణం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నాకు సౌత్ లో ఒకప్పుడు వరుస ఆఫర్స్ వచ్చాయి. నేను టాలీవుడ్ లోనే స్టార్ అయ్యాను. నా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు వరుసగా కొన్ని పరాజయాలు వచ్చాయి. అదే సమయంలో ఓ సీనియర్ హీరోతో ముద్దు సన్నివేశాల్లో నటించాను. అవి ఆడియన్స్ కి నచ్చలేదు. ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. ఆ సన్నివేశాలను అభిమానులు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో నాకు సౌత్ లో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అప్పట్నుంచి నేను బాలీవుడ్ మీద ఫోకస్ చేసాను అని చెప్పింది.
Jawan : షారుఖ్ జవాన్.. కేవలం మ్యూజిక్ రైట్స్‌కి ఏకంగా అన్ని కోట్లా..?
అయితే డైరెక్ట్ గా చెప్పకపోయినా రకుల్ కిస్ సీన్స్ చేసిన సీనియర్ హీరో నాగార్జుననే. మన్మధుడు 2 సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించారు. ఇందులో కిస్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమా పరాజయం పాలైంది. పేరు చెప్పకుండా రకుల్ ఇండైరెక్ట్ గా మన్మధుడు 2, నాగార్జున గురించే మాట్లాడిందని అంటున్నారు. మరి దీనిపై అక్కినేని అభిమానులు ఏమంటారో చూడాలి.