ram and pawan fans are fighting for ustaad tag
Ustaad Bhagat Singh : గబ్బర్ సింగ్ కాంబినేషన్ సెట్ చేస్తూ.. దాదాపు 10 ఏళ్ళ తరువాత చేతులు కలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్. సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. అయితే ఈ టైటిల్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు హీరోల అభిమానులు గొడవలు పడుతున్నారు.
Pawan Kalyan : ‘ది రియల్ యోగి’ బుక్‌ని లాంచ్ చేసిన నాగబాబు..
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ‘రామ్ పోతినేని’ని అభిమానులు ఉస్తాద్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే పవన్, హరీష్ సినిమాకి ‘ఉస్తాద్’ అనే టైటిల్ ని పెట్టడడంతో ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య రగడ రాచుకుంది. ‘ఉస్తాద్’ అనే ట్యాగ్ మా హీరో రామ్ కి మాత్రమే సొంతం. మీ టైటిల్ నుంచి ఆ ట్యాగ్ ని తీసేయండి అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ ని డిమాండ్ చేస్తున్నారు రామ్ ఫ్యాన్స్.
ఈ డిమాండ్ కి పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తుండడంతో, రామ్ ఫ్యాన్స్.. “గుర్తుపెట్టుకోండి మా రామ్ అన్నయ్య ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ కి ఓటు బ్యాంకు ఉంది” అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియా మొత్తం పవన్ అండ్ రామ్ ఫ్యాన్ వార్స్ తో హీటెక్కుతోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ గాని, హీరో రామ్ గాని స్పందిస్తారా? అనేది చూడాలి.