Pawan Kalyan : ‘ది రియల్ యోగి’ బుక్‌ని లాంచ్ చేసిన నాగబాబు..

సినిమాలతో సంబంధం లేకుండా ఎనలేని అభిమానాన్ని, ప్రేమని సంపాదించుకున్న నటుడు 'పవన్ కళ్యాణ్'. తన ఆనందం కోసం కాకుండా ఇతరుల కళ్ళలో ఆనందాన్ని నింపేందుకు తాపత్రయం పడుతున్న పవన్ కళ్యాణ్ నిజంగా ఒక 'యోగి' అంటున్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే...

Pawan Kalyan : ‘ది రియల్ యోగి’ బుక్‌ని లాంచ్ చేసిన నాగబాబు..

The real yogi book launch by nagababu

Updated On : December 18, 2022 / 8:17 AM IST

Pawan Kalyan : సినిమాలతో సంబంధం లేకుండా ఎనలేని అభిమానాన్ని, ప్రేమని సంపాదించుకున్న నటుడు ‘పవన్ కళ్యాణ్’. సినిమాలతో కోట్లు సంపాదించి లగ్జరీగా బ్రతికే జీవితాన్ని వదిలేసుకొని ప్రజలకి మంచి చేయాలనే ఉదేశంతో రాజకీయంవైపు అడుగు వేసి ‘జనసేన’ అనే పార్టీని స్థాపించాడు పవన్ కళ్యాణ్. అపజయాలు ఎదురైనా వెనక్కి తిరగకుండా సేవే తన లక్ష్యంగా నిజమైన నాయకుడిగా నిలిస్తున్నాడు.

Pawan Kalyan : అన్‌స్టాపబుల్‌-2లో.. పవర్ స్టార్‌!

తన ఆనందం కోసం కాకుండా ఇతరుల కళ్ళలో ఆనందాన్ని నింపేందుకు తాపత్రయం పడుతున్న పవన్ కళ్యాణ్ నిజంగా ఒక ‘యోగి’ అంటున్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే, పవన్ ని ఇప్పటి వరకు అసలు కలవని ఒక అభిమాని.. కేవలం పవన్ కళ్యాణ్ ఆలోచనలు, విధానాలతో మోటివేట్ అయ్యి ‘ది రియల్ యోగి’ అంటూ ఒక బుక్ ని రాశాడు. ఈ బుక్ లాంచ్ ఈవెంట్ శనివారం గ్రాండ్ గా జరిగింది.

పవన్ కళ్యాణ్ లోని యోగి తత్వాన్ని ఎక్స్‌ప్లోర్ చేసే ఈ పుస్తక ఆవిష్కరణకి నాగబాబు, మెహర్ రమేష్ అతిధులుగా వచ్చారు. బుక్ ని ఆవిష్కారించిన నాగబాబు మాట్లాడుతూ.. ‘ఒక మనిషి తాలుకు గొప్పతనం వారు మన మధ్యన ఉండగా మనం ఒప్పుకోము. ఒక్క పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయినా అలా జరగకూడదు అని, ఈ పుస్తకం రాయడానికి రచయిత గణ పూనుకున్నాడని’ తెలియజేశాడు.