Ram Charan – Balakrishna : బాలయ్య అన్‌స్టాప‌బుల్‌ కి చరణ్ తో పాటు ఇంకో ముగ్గురు.. ఎవెరెవరో తెలుసా? చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్..

నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ రానున్నాడు. నేడు ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది.

Ram Charan and his Best Friends also Coming to Balakrishna Unstoppable Show

Ram Charan – Balakrishna : బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్‌ షో ఆహా ఓటీటీలో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇటీవలే వెంకటేష్ ఈ షోకి వచ్చి సందడి చేసారు. బాలయ్య – వెంకటేష్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగింది. ఆ ఎపిసోడ్ కి వెంకటేష్ తో పాటు సురేష్ బాబు, సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీమ్ వచ్చి సందడి చేసారు. తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ చేసారు.

Also Read : Prabhas : డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. డ్రగ్స్ అవగాహన కోసం ప్రభాస్ చేసిన వీడియో చూశారా?

బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్‌ నెక్స్ట్ ఎపిసోడ్ లో డాకు మహారాజ్ టీమ్ తమన్, డైరెక్టర్ బాబీ, నాగవంశీ వచ్చి రచ్చ చేసారు. ఈ ప్రోమో ఇవాళే రిలీజ్ చేసారు. అలాగే ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ రానున్నాడు. నేడు ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే చరణ్, బాలయ్య కలిసిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఎపిసోడ్ కి చరణ్ తో పాటు మరో ముగ్గురు వచ్చారని సమాచారం.

రామ్ చరణ్ తో పాటు అన్‌స్టాప‌బుల్‌ షోకి చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ హీరో శర్వానంద్, యువ నిర్మాత విక్రమ్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది. శర్వానంద్ కూడా అన్‌స్టాప‌బుల్‌ సెట్స్ కి వచ్చిన కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. అలాగే చరణ్ పెట్ డాగ్ రైమ్ కూడా బాలయ్య షోలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. రైమ్ సోషల్ మీడియాలో పేజీలో రైమ్ ఫోటో షేర్ చేసి.. ఇట్స్ షో టైం. 2025 లో చూడండి అంటూ రాసుకొచ్చారు.

Also Read : Marco : ‘మార్కో’ మూవీ రివ్యూ .. బాబోయ్ మలయాళం సినిమాలో మరీ ఇంత వైలెన్సా..

దీంతో బాలయ్య అన్‌స్టాప‌బుల్‌ నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్, శర్వానంద్, విక్రమ్ రెడ్డి, చరణ్ పెట్ డాగ్ రైమ్ కనపడనున్నారు. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 10న గేమ్ చెంజర్ రిలీజ్ రోజే రిలీజ్ చేస్తారని, పండగ ఎపిసోడ్ లా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం మెగా – నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.