Ram Charan and Upasana Meets Maharashtra CM Eknath Shinde Photo Goes Viral
Ram Charan : ఇటీవల రామ్ చరణ్ దంపతులు ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చరణ్ దంపతులు ముంబైలోనే ఉన్నారు. తమ పాప క్లిన్ కారాతో కలిసి ఇటీవల ముంబైలో ఓ ఆలయానికి వెళ్లిన వీడియోలు బయటకి వచ్చి వైరల్ కూడా అయ్యాయి. తాజాగా రామ్ చరణ్ ఓ స్పెషల్ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read : Salaar : సలార్‌లో కనిపించిన ఖాన్సార్ సిటీ ఎక్కడుందో తెలుసా?
మహారాష్ట్ర సీఎం(Maharashtra CM) ఏక్‌నాథ్ షిండే చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి స్పెషల్ విందు ఇచ్చారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, అతని ఫ్యామిలీతో చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫోటోని రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మహారాష్ట్ర సీఎం గారు, శ్రీకాంత్ షిండే గారు, మహారాష్ట్ర ప్రజలకు మా మీద ఆప్యాయత చూపించి మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని పోస్ట్ చేశారు. మహారాష్ట్ర సీఎంతో చరణ్, ఉపాసన దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇక ఉపాసన కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో మహారాష్ట్ర సీఎం చరణ్ కి ఓ వినాయక విగ్రహం బహుకరించారు. అలాగే ఉపాసనను సంప్రదాయంగా సత్కరించారు.