రాజమౌళి గారు, మీ ఛాలెంజ్‌ని పూర్తి చేసాను : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్…

ముందుగా యువ దర్శకుడు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్, అక్కడినుంచి వరుసగా పలువురు సినీ ప్రముఖులకు చేరుకుంది. దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి వద్దకు చేరగా, ఆయన దానిని సక్సెస్ఫుల్‌గా పూర్తి చేసి, అదే ఛాలెంజ్‌ని ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు సుకుమార్‌లకు విసిరారు.
కాగా జక్కన్న ఛాలెంజ్‌ని స్వీకరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంగళవారం దానిని కంప్లీట్ చేయగా, అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాజమౌళి ఛాలెంజ్‌ని పూర్తి చేసిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసి, ఆపై అదే ఛాలెంజ్‌ని దర్శకుడు త్రివిక్రమ్‌కు, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, టాలీవుడ్ నటులు దగ్గుబాటి రానా, శర్వానంద్‌లకు విసిరారు చరణ్..
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు తమ రోజూ వారీ పనులను ఫోటోలు, వీడియోల రూపంలో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌గా మారింది.