Game Changer – OG : సెప్టెంబర్‌లో బాబాయ్, అబ్బాయి పోటీ ఉంటుందా.. ఓజి కోసం గేమ్ ఛేంజర్ వాయిదా..!

సెప్టెంబర్ లో బాబాయ్ పవన్, అబ్బాయి చరణ్ మధ్య పోటీ ఉండబోతుందా..? ఓజి కోసం గేమ్ ఛేంజర్ పోస్టుపోన్ కాబోతుందా..?

Ram Charan Game Changer is really postponed from september due to Pawan Kalyan OG

Game Changer – OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఓజి, గేమ్ ఛేంజర్. ఈ రెండు సినిమాల కోసం మెగా అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఓజి చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తుంటే, గేమ్ ఛేంజర్‌ని శంకర్ తెరకెక్కిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై మెగా ఫ్యాన్స్ లో చర్చ నడుస్తుంది.

గేమ్ ఛేంజర్ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు దిల్ రాజు ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పవన్ ఓజి సినిమాని కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ, సెప్టెంబర్ రిలీజ్ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యిపోయింది. దీంతో సెప్టెంబర్ లో బాబాయ్, అబ్బాయి పోటీ ఉండబోతుందా..? అనే సందేహం మొదలయింది.

Also read : Ashish : ఆశిష్ పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన దిల్ రాజు.. ఎన్టీఆర్‌తో మొదలు..!

అయితే ఓజి విడుదల తేదీ వార్త వచ్చిన దగ్గర నుంచి ఫిలిం వర్గాల్లో ‘గేమ్ ఛేంజర్’ పోస్టుపోన్ వార్త చక్కర్లు కొడుతోంది. గేమ్ ఛేంజర్ ని ఈ ఏడాది కాకుండా ఏకంగా వచ్చే సంవత్సరానికి వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో చరణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గేమ్ ఛేంజర్ ఇప్పటికే లేట్ అవుతూ వస్తుంది. గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.

ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ పోస్టుపోన్ వార్త వినిపిస్తుండడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి ఈ వాయిదా వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే.. నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సిందే. గేమ్ ఛేంజర్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంటే, పవన్ ఓజి మూవీ గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంతో సాగుతుంది. రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.