Ashish : ఆశిష్ పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన దిల్ రాజు.. ఎన్టీఆర్‌తో మొదలు..!

ఆశిష్ పెళ్లి పిలుపులను మొదలుపెట్టిన దిల్ రాజు. స్టార్స్ లో మొదటి శుభలేఖని ఎన్టీఆర్‌కే ఇచ్చారా..!

Ashish : ఆశిష్ పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన దిల్ రాజు.. ఎన్టీఆర్‌తో మొదలు..!

Dil Raju invites NTR to his brother son Ashish wedding

Updated On : January 31, 2024 / 3:40 PM IST

Ashish : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన నటుడు ఆశిష్. దిల్ రాజు సోదరుడు మరియు నిర్మాత శిరీష్ తనయుడే ఆశిష్. ‘రౌడీ బాయ్స్’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ కి పరిచయమైన ఆశిష్.. ప్రస్తుతం తన రెండో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈలోపే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నారు.

ఈక్రమంలోనే గత ఏడాది నవంబర్‌లో సైలెంట్ గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏపీకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అయిన అద్విత రెడ్డితో ఆశిష్ ఏడడుగులు వేయబోతున్నారు. ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సింపుల్ గా చేసేసుకున్న ఆశిష్.. పెళ్లిని మాత్రం ఘనంగా జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలోని స్టార్స్ అందర్నీ తన పెళ్ళికి రావాలంటూ పిలుపులు పంపిస్తున్నారు.

Also Read : Sundeep Kishan : కుమారి ఆంటీకి అండగా నిలుస్తానన్న సందీప్ కిషన్..

ఇక కొడుకు పెళ్లి బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్న దిల్ రాజు.. పెళ్లి పిలుపులను మొదలుపెట్టి ఒక్కొక్కర్ని కలుసుకుంటూ ఆహ్వాన పత్రిక అందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ కి కూడా ఆశిష్ పెళ్లి శుభలేఖని దిల్ రాజు, శిరీష్ కలిసి అందించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు.. స్టార్స్ లో మొదటి శుభలేఖని ఎన్టీఆర్‌కే ఇచ్చారా అని కామెంట్స్ చేస్తున్నారు.

Dil Raju invites NTR to his brother son Ashish wedding

ఇది ఇలా ఉంటే, ఆశిష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. రెండో మూవీగా ‘సెల్ఫిష్’ అనే చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాశి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యినట్లు సమాచారం. ఇక రీసెంట్ గా మూడో సినిమా కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని అరుణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.