Sundeep Kishan : కుమారి ఆంటీకి అండగా నిలుస్తానన్న సందీప్ కిషన్..

ఇటీవల కుమారి ఆంటీ భోజనం తిన్న హీరో సందీప్ కిషన్.. ప్రస్తుతం ఆమె కష్టంలో అండగా నిలుస్తా అంటూ ట్వీట్ చేశారు.

Sundeep Kishan : కుమారి ఆంటీకి అండగా నిలుస్తానన్న సందీప్ కిషన్..

Sundeep Kishan tweet on hyderabad Kumari Aunty Food Stall issue

Updated On : January 31, 2024 / 2:06 PM IST

Sundeep Kishan : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన గొప్ప మనసుని చాటుకున్నారు. సామాన్య మహిళా వ్యాపారికి తన సపోర్ట్ ని తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం అందరూ సందీప్ కిషన్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటి..?

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ అనే పేరు మోతమోగిపోయింది. ఈమె మాదాపూర్ దుర్గంచెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నడుపుతూ ఉన్నారు. తక్కువ ధరకే కమ్మని భోజనం పెడుతుండడంతో.. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. దీంతో అక్కడ భోజనం చేసేందుకు వచ్చే జనాలు సంఖ్య ఎక్కువైంది. ఈక్రమంలో ఆ జనాలు వల్ల అక్కడి ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.

దీంతో ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ స్టాల్ ని అక్కడి నుంచి తొలిగించాలని, నిన్న (జనవరి 30) వెంటనే స్టాల్ ని మూయించారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ లో బాగా వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ విషయం పై నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి.. “ఆమెను త్వరలోనే కలుస్తాను, ఆమె అక్కడే స్టాల్ నిర్వహించుకునేలా అధికారులను ఆదేశిస్తున్నాను” అని చెప్పడం గమనార్హం.

Also read : Prasanth Varma : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రికెటర్ అని తెలుసా? మళ్ళీ ప్రాక్టీస్ మొదలు..

ఇక ఈ విషయం పై సందీప్ కిషన్ నిన్న రాత్రే రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు. “గత కొన్నెల్లో నేను చుసిన మహిళా వ్యాపారుల్లో ఈమె కూడా ఒకరు. తన సొంతంగా బిజినెస్ నడుపుతూ తన కుటుంబానికి సపోర్ట్ గా నిలిస్తున్న కుమారి ఆంటీ, ఎంతో మంది మహిళలకు ఆదర్శం. ఆమె పట్ల ఇలా చేయడం న్యాయం కాదు. నేను, మా టీం ఆమె చేయనంత సాయం చేస్తాం” అంటూ ట్వీట్ చేశారు.

కాగా ఇటీవల సందీప్ కిషన్ తన సినిమా ‘ఊరు పేరు భైరవకోన’ ప్రమోషన్స్‌ని.. కుమారి ఆంటీ దగ్గర భోజనం చేస్తూ చేశారు. సందీప్ తో పాటు హీరోయిన్స్ కావ్య తాపర్, వర్ష బొల్లమ్మ కూడా కుమారి ఆంటీ దగ్గర భోజనం చేశారు.