Prasanth Varma : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రికెటర్ అని తెలుసా? మళ్ళీ ప్రాక్టీస్ మొదలు..

 హనుమాన్ సినిమాతో దేశమంతటా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మరోవైపు ప్రశాంత్ ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా.

Prasanth Varma : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రికెటర్ అని తెలుసా? మళ్ళీ ప్రాక్టీస్ మొదలు..

Prasanth Varma : హనుమాన్(Hanuman) సినిమాతో దేశమంతటా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. గతంలోనే అ, కల్కి, జాంబిరెడ్డి లాంటి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ సినిమాతో థియేటర్లని హౌస్ ఫుల్ అయ్యేలా చేసాడు. ఇక తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి చెప్పి అందులో పాత్రలు, రాబోయే సినిమాలు గురించి చెప్పడంతో బాబోయ్ ఇంత ట్యాలెంటెడ్ ఏంటి అని అంతా అనుకుంటున్నారు.

అయితే ప్రశాంత్ ట్యాలెంట్ లో ఇదంతా కొంచెమే. మరోవైపు ప్రశాంత్ ప్రొఫెషనల్ క్రికెటర్(Cricketer) కూడా. స్కూల్, కాలేజీ లెవెల్స్ నుంచి ప్రశాంత్ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. డిస్ట్రిక్ లెవల్ లో పలు కప్పులు గెలుచుకున్నాడు. పలు ప్రైవేట్ టోర్నమెంట్స్ లో కూడా ఆడి ప్రశాంత్ వర్మ క్రికెటర్ గా కూడా సక్సెస్ అయి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రశాంత్ బ్యాట్స్ మెన్, బౌలర్ కూడా. పలు టోర్నమెంట్స్ లో అత్యధిక రన్స్ సాధించి బెస్ట్ బ్యాట్స్ మెన్, బౌలింగ్ లో కూడా తన సత్తా చూపించి బెస్ట్ బౌలర్ అవార్డులు సాధించాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా ఆడాడు ప్రశాంత్.

గతంలో తన క్రికెట్ విజయాలు, క్రికెట్ ప్రాక్టీస్ వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు ప్రశాంత్ వర్మ. ఇన్ని రోజులు హనుమాన్ సినిమా వర్క్స్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ తాజాగా హనుమాన్ సక్సెస్ తర్వాత మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తాజాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని షేర్ చేసాడు ప్రశాంత్. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు డైరెక్టర్ ఆల్సో.. క్రికెటర్ ఆల్సో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ మరోవైపు బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. బ్యాడ్మింటన్ లోనూ పలు టోర్నమెంట్స్ లో పాల్గొన్నాడు.

Also Read : Prabhas : సమంత లాగే.. ప్రభాస్ కూడా సినిమాలకు గ్యాప్.. ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే?

ఇక ప్రశాంత్ వర్మ మన హైదరాబాద్ SRH టీంకి అనేక యాడ్స్ డైరెక్ట్ కూడా చేసాడు. దీంతో పలువురు నెటిజన్లు IPL లో SRH తరపున ఆడమని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా వర్క్ మొదలుపెట్టాడు. త్వరలో మరిన్ని సూపర్ హీరో సినిమాలు ప్రశాంత్ నుంచి రానున్నాయి.