Game Changer : ‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియా మూవీ కాదా..? కేవలం ఆ భాషల్లోనే రిలీజ్..

'గేమ్ ఛేంజర్' పాన్ ఇండియా మూవీగా రావడం లేదా..? కేవలం ఆ భాషల్లోనే ఈ సినిమా..

Ram Charan Game Changer movie is not releasing in pan India wide

Game Changer : దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ పై చరణ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం శంకర్ తన పాత హిట్ ఫార్ములాతోనే మళ్ళీ ఈ సినిమాని తెరకెక్కిస్తుండడం. సామజిక సమస్యలను కమర్షియల్ గా చెప్పడంలో శంకర్ ఎక్స్‌పర్ట్. కానీ రోబో నుంచి శంకర్ ఈ ఫార్ములాని కొద్దిగా పక్కన పెట్టారు.

రోబో సీక్వెల్ లో ఆ పాయింట్ కొంచెం చూపించే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో ఈసారి కంప్లీట్ గా తన పాత స్టైల్ లోకి వెళ్లి శంకర్ గేమ్ ఛేంజర్ ని రూపొందిస్తున్నారు. పొలిటికల్ గేమ్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా ఆర్ఆర్ఆర్ వంటి సక్సెస్ తరువాత చరణ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో.. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా పై మంచి బజ్ నెలకుంది.

Also read : Nani : బ్రిటన్ అంబాసడర్‌తో హీరో నాని.. ఏ సినిమా చూడాలంటూ ఫ్యాన్స్‌కి ప్రశ్న..

దీంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఈ సినిమా కేవలం మూడు భాషల్లోనే రిలీజ్ చేయబోతున్నారట. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీలోని ‘జరగండి’ సాంగ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసారు. ఆ పోస్టర్ లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఇది చూసిన చరణ్ అభిమానుల్లో కొంత నిరాశ నెలకుంది.

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయితే.. భారీ కలెక్షన్స్ ని నమోదు చేసే అవకాశం ఉంటుంది కదా అని తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. కాగా ‘జరగండి’ సాంగ్ ని రేపు మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఈ పాటని విడుదల చేస్తున్నారు. ఈ సాంగ్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. మరి మూవీ టీం ఏం చేస్తారో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు