Nani : బ్రిటన్ అంబాసడర్‌తో హీరో నాని.. ఏ సినిమా చూడాలంటూ ఫ్యాన్స్‌కి ప్రశ్న..

బ్రిటన్ అంబాసడర్‌తో హీరో నాని చర్చలు. కాగా ఆ అంబాసడర్.. నాని సినిమాల్లో ఏది చూడమంటారు అంటూ ఫ్యాన్స్ కి ట్వీట్ చేసారు.

Nani : బ్రిటన్ అంబాసడర్‌తో హీరో నాని.. ఏ సినిమా చూడాలంటూ ఫ్యాన్స్‌కి ప్రశ్న..

Saripodhaa Sanivaaram hero Nani met UK ambassador

Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్స్ లో ఉన్నారు. హాయ్ నాన్న, దసరాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో హిట్టుని అందుకొని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా మన నేచురల్ స్టార్ నాని.. బ్రిటన్ అంబాసడర్‌ని కలుసుకున్నారు.

హైదరాబాద్ లో ఉన్న బ్రిటన్ అంబాసడర్ ని కలుసుకున్న నాని.. టాలీవుడ్ గురించి చర్చించారట. బ్రిటన్ తో తెలుగు సినిమా పరిశ్రమ సంబంధాలను ఎలా పెంచుకోవాలి అనే విషయాలు పై నాని అంబాసడర్ తో మాట్లాడారు. అలాగే ఆఫ్ స్క్రీన్ లో తన లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా అంబాసడర్ కి నాని తెలియజేశారట. ఇక తన సినిమాలు గురించి మాట్లాడుతూ.. కొన్ని మూవీస్ ని సజెస్ట్ చేశారట.

Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ రిలీజ్‌కి టైం ఫిక్స్.. ఇక ‘జరగండి’ అనడం లేదు..

ఈ విషయాన్ని బ్రిటన్ అంబాసడర్ ట్వీట్ చేస్తూ.. “నాని నటించిన సినిమాల్లో ఏది చూడమంటారు” అంటూ ఫ్యాన్స్ ని అడిగారు. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. పలు సినిమాలను సజెస్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని, అంబాసడర్ మీటింగ్ కి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ‘సరిపోదా శనివారం’ సినిమా విషయానికి వస్తే.. వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు నానితో ‘అంటే సుందరానికి’ వంటి హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేసారు. ఇక ఈసారి ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ ని తీసుకు వస్తున్నారు. ఈ సినిమాలో నాని పాత్ర ఎలా ఉంటుంది అంటే.. వారం అంతా కోపం కంట్రోల్ చేసుకొని, ఆ మొత్తం కోపాన్ని శనివారం నాడు ఒకేసారి చూపించేస్తాడు. మరి ఓ కొత్త మాస్ పాయింట్ తో వస్తున్న ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.