Game Changer : ‘జరగండి’ సాంగ్ రిలీజ్‌కి టైం ఫిక్స్.. ‘మగధీర’ సినిమాతో పాటు థియేటర్స్‌లో..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి జరగండి సాంగ్ ని రిలీజ్ చేయడం కోసం టైం ఫిక్స్ చేసారు.

Game Changer : ‘జరగండి’ సాంగ్ రిలీజ్‌కి టైం ఫిక్స్.. ‘మగధీర’ సినిమాతో పాటు థియేటర్స్‌లో..

Ram Charan Game Changer Jaragandi song release time update

Game Changer : శంకర దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతుంది. గత మూడేళ్ళగా షూటింగ్ లోనే ఉన్న ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ అండ్ టైటిల్ తప్ప మరో అప్డేట్ లేదు. ఆమధ్య ‘జరగండి’ సాంగ్ రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేసి మళ్ళీ పోస్టుపోన్ చేసి అభిమానులను నిరాశ పరిచారు. అయితే ఆ సాంగ్ ని ఇప్పుడు చరణ్ బర్త్ డే గిఫ్ట్ గా తీసుకు వస్తున్నారు.

థమన్ సంగీతం దర్శకత్వంలో రూపొందిన ‘జరగండి’ సాంగ్ ని.. రేపు మార్చి 27న ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఆల్రెడీ ఈ సాంగ్ నెట్టింట లీక్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే సాంగ్ ని అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆల్రెడీ రిలీజ్ చేస్తామంటూ పోస్టుపోన్ చేసిన మేకర్స్.. ఈ సాంగ్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారేమో చూడాలి.

Also read : Uday Kiran : ఉదయ్ కిరణ్‌కి చిరంజీవే గాడ్ ఫాదర్.. మరోసారి ఆ ఇష్యూపై మాట్లాడిన ఉదయ్ కిరణ్ సోదరి..

కాగా ఈ బర్త్ డే సందర్భంగా ‘మగధీర’ స్పెషల్ షోస్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో పాటు ఈ సాంగ్ ని కూడా థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారట. ఇక ఈ సాంగ్ ని శంకర్ స్టాండర్డ్ మేకింగ్ లో కలర్‌ఫుల్ గా చిత్రీకరించారు. రామ్ చరణ్ డాన్స్, కియారా అద్వానీ అందాలతో సాంగ్ ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.