Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్.. ఎప్పుడు? ఎక్కడ?.. బాబాయ్ కోసం అబ్బాయి.. స్పెషల్ పోస్టర్ రిలీజ్..

తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

Ram Charan Game Changer Pre Release event Details Pawan Kalyan as Guest

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, నాలుగు సాంగ్స్ రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. తాజాగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ అధికారికంగా ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో జరుగుతుందని, పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తారని వార్తలు వచ్చాయి. నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ని కలిశారు. తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

Also See : Ram Charan : గేమ్ ఛేంజర్ ఈవెంట్లో రామ్ చరణ్ RC16 లుక్స్ అదిరాయిగా.. చరణ్ ఫొటోలు చూశారా?

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జనవరి 4వ తేదీ సాయంత్రం జరగనుంది. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఫొటోతో గేమ్ ఛేంజర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. బాబాయ్ అబ్బాయి కోసం రాబోతుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

రాజమండ్రిలో భారీగా మెగా అభిమానుల మధ్య ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆ చుట్టుపక్కల మెగా ఫ్యాన్స్ అంత రాజమండ్రికి తరలి రానున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వస్తుండటంతో ఈ ఈవెంట్ పై భారీ హైప్ నెలకొంది.

 

ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీకాంత్, SJ సూర్య, సముద్రఖని, అంజలి, కియారా అద్వానీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Game Changer : వామ్మో.. గేమ్ ఛేంజర్ సినిమాకు ఇంతమంది డ్యాన్స్ మాస్టర్స్ వర్క్ చేశారా? ప్రభుదేవా డబ్బులు తీసుకోకుండా..