Game Changer : వామ్మో.. గేమ్ ఛేంజర్ సినిమాకు ఇంతమంది డ్యాన్స్ మాస్టర్స్ వర్క్ చేశారా? ప్రభుదేవా డబ్బులు తీసుకోకుండా..

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాలో పాటలకు పనిచేసిన డాన్స్ మాస్టర్స్ గురించి మాట్లాడారు.

Game Changer : వామ్మో.. గేమ్ ఛేంజర్ సినిమాకు ఇంతమంది డ్యాన్స్ మాస్టర్స్ వర్క్ చేశారా? ప్రభుదేవా డబ్బులు తీసుకోకుండా..

Ram Charan Game Changer Dance Masters Full List Here Director Shankar says about all Choreographers

Updated On : January 2, 2025 / 7:45 PM IST

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన నాలుగు సాంగ్స్, టీజర్ బాగా వైరల్ అవ్వగా నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. నాలుగు సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. ఆ సాంగ్స్ లో చరణ్ స్టెప్పులు కూడా అదిరిపోయాయి.

Also Read : Rajamouli : చరణ్ ని అలా పిలుస్తాను.. నా పర్మిషన్ లేకుండా ఇకపై అలాంటివి చెయ్యకు.. చరణ్‌కు రాజమౌళి వార్నింగ్..

తాజాగా నేడు గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని AMB మాల్ లో నిర్వహించగా మూవీ టీమ్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాలో పాటలకు పనిచేసిన డాన్స్ మాస్టర్స్ గురించి మాట్లాడారు.

శంకర్ మాట్లాడుతూ .. ప్రభుదేవా ‘జరగండి’ సాంగ్‌ను డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేశారు. రామ్ చరణ్ గారి మీద ప్రేమతో, దిల్ రాజు గారి మీద గౌరవంతో ఫ్రీగా చేసారు. డబ్బులు వద్దు జస్ట్ టైటిల్ కార్డు వేయండి చాలు అని అడిగారు. ‘రా మచ్చా’ పాటను గణేష్ ఆచార్య చేశారు. ఈ సాంగ్ లో ఒక ఫుల్ బీజీఎమ్ సింగిల్ షాట్ లో షూట్ చేశారు. సాంగ్ అనుకున్న దానికంటే ఒక రోజు ముందే షూట్ చేశారు. ప్రేమ్ రక్షిత్ ఒక విలేజ్ సాంగ్ చేశారు. జానీ మాస్టర్ ధోప్ సాంగ్ చేశారు. నేను ఏదో కొత్తగా ఆలోచిస్తే నా కంటే కొత్తగా ఆలోచించి కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్. ‘హైరానా’ పాటను బాస్కో మాస్టర్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. శాండీ మాస్టర్ చిన్న బిట్ సాంగ్ చేశారు. ప్రతీ కొరియోగ్రాఫర్ రామ్ చరణ్ తో మంచి స్టెప్స్ వేయించారు అని తెలిపారు.

Also Read : Ram Charan – SSMB 29 : గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్లో రాజమౌళి – మహేష్ సినిమా గురించి మాట్లాడిన రామ్ చరణ్..

దీంతో మొత్తం గేమ్ ఛేంజర్ సినిమాకు ఒక్కో పాటకు ఒక్కొక్కరు చొప్పున ఆరుగురు డ్యాన్స్ మాస్టర్స్ కంపోజ్ చేశారు. ఒక్క సినిమా కోసం ఆరుగురు కొరియోగ్రాఫర్స్ ని తెచ్చారంటే మాములు విషయం కాదు. ఎంతైనా శంకర్ సినిమా అంటే ఈ రేంజ్ గ్రాండియర్ ఉంటుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. థియేటర్లో చరణ్ వేసిన స్టెప్స్ చూడటానికి ఎదురుచూస్తున్నారు అభిమానులు.