Ram Charan – SSMB 29 : గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్లో రాజమౌళి – మహేష్ సినిమా గురించి మాట్లాడిన రామ్ చరణ్..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సుమ మహేష్ బాబు - రాజమౌళి సినిమా గురించి రామ్ చరణ్ ని ప్రశ్నించింది.

Ram Charan Comments in Rajamouli Mahesh Babu SSMB 29 Movie in Game Changer Trailer Launch Event
Ram Charan – SSMB 29 : రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చి అంచనాలు పెంచాయి. నేడు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా రామ్ చరణ్, శంకర్ తో పాటు అంజలి, SJ సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని హాజరయ్యారు. రాజమౌళి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు.
అయితే నేడు ఉదయం రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం కూడా జరిగిన సంగతి తెలిసిందే. RRR తర్వాత రాజమౌళి నుంచి రాబోయే భారీ సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఉదయం SSMB 29 సినిమా పూజా కార్యక్రమం అవ్వగానే రాజమౌళి ఈ ఈవెంట్ కి వచ్చారు.
అయితే గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సుమ మహేష్ బాబు – రాజమౌళి సినిమా గురించి రామ్ చరణ్ ని ప్రశ్నించింది. ఎప్పుడు వస్తుందో చెప్పగలరా అని అడగ్గా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈసారి లేట్ అవ్వదు. కరోనా లాంటివి ఏమి లేకపోతే రాజమౌళి మహేష్ బాబు సినిమా ఒకటిన్నర సంవత్సరంలోనే వచ్చేస్తుంది అని చెప్పారు. వెంటనే రాజమౌళి బాగా ట్రైనింగ్ ఇచ్చాను అని సరదాగా అన్నారు.
Also Read : Daaku Maharaaj Song : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి స్పెషల్ దబిడి దబిడి సాంగ్ వచ్చేసింది..
రాజమౌళి సినిమా అంటే చాలా సమయం పడుతుంది అని తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఇది సరదాగా అన్నా ఇదే నిజం అయి సంవత్సరంన్నరలో మహేష్ – రాజమౌళి సినిమా వచ్చేస్తే బాగుండు అని మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.