Daaku Maharaaj Song : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి స్పెషల్ దబిడి దబిడి సాంగ్ వచ్చేసింది..

తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Daaku Maharaaj Song : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి స్పెషల్ దబిడి దబిడి సాంగ్ వచ్చేసింది..

Balakrishna Daaku Maharaaj Dabidi Dabidi Special Song Released

Updated On : January 2, 2025 / 5:26 PM IST

Daaku Maharaaj Song : డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నాడని టాక్.

Also Read : Ram Charan : క్రికెటర్స్‌తో రామ్ చరణ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్..

ఇప్పటికే డాకు మహారాజ్ సినిమా నుంచి టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ దబిడి దబిడి స్పెషల్ సాంగ్ లో బాలయ్యతో కలిసి ఊర్వశి రౌతేలా స్టెప్పులేసింది. మీరు కూడా సాంగ్ ఈ సాంగ్ చూసేయండి..

శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ లో మేకింగ్ వీడియో కూడా చూపెట్టగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా కనపడి సందడి చేసాడు. మంచి బీట్ తో ఉన్న ఈ సాంగ్ థియేటర్స్ లో స్టెప్పులు వేయించడం ఖాయం. బాలయ్య ఫ్యాన్స్ కి అయితే ఇది స్పెషల్ సాంగ్ అవుతుంది.