Ram Charan : క్రికెటర్స్‌తో రామ్ చరణ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్..

తాజాగా రామ్ చరణ్ క్రికెటర్స్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి ఉన్న ఓ ఫొటో వైరల్ గా మారింది.

Ram Charan : క్రికెటర్స్‌తో రామ్ చరణ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్..

Ram Charan Celebrate New Year with Hardik Pandya and Krunal Pandya Photos goes Viral

Updated On : January 2, 2025 / 4:43 PM IST

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసాడు. నేడు గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా పాల్గొననున్నాడు. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రామ్ చరణ్ క్రికెటర్స్ తో చేసుకున్నట్టు తెలుస్తుంది.

Also Read : Jani Master – Janasena : జనసేన పార్టీ ఆదేశాలపై మొదటిసారి స్పందించిన జానీ మాస్టర్.. కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం..

తాజాగా రామ్ చరణ్ క్రికెటర్స్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి ఉన్న ఓ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో రామ్ చరణ్ తో పాటు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఫొటోల్లో చరణ్ ఫుల్ బ్లాక్ డ్రెస్ లో, RC16 లుక్స్ తో స్టైల్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Ram Charan

అయితే ఈ సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయి, ఇంకా ఎవరెవరు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు అనేది తెలియలేదు. ఓ రెండు ఫొటోలు మాత్రం లీక్ అయి బయటకు వచ్చాయి. గతంలో కూడా చరణ్ పలువురు క్రికెటర్స్ ని కలిసిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read : Armaan Malik : పెళ్లి చేసుకున్న ‘బుట్టబొమ్మ’ సింగర్ అర్మాన్ మాలిక్.. ఫొటోలు చూశారా? పెళ్లికూతురు ఎవరో తెలుసా?

ఇక చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చి అంచనాలు పెంచాయి. నేడు ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Ram Charan Celebrate New Year with Hardik Pandya and Krunal Pandya Photos goes Viral